WNP: వనపర్తి మండలం కాసింనగర్, ఎర్రగట్టు తండాకు చెందిన నరసింహ, నీలేశ్వర్ ఆధ్వర్యంలో 40 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి వారికి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని కోరారు.