• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు:మంత్రి ఆనం

NLR: మాజీ ఎంపీ, కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ మృతి పట్ల రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి బుధవారం సంతాపం ప్రకటించారు.రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అంత్యక్రియల ఏర్పాట్ల కోసం నెల్లూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చర్చించారు.

September 26, 2024 / 06:54 AM IST

‘మాగుంట పార్వతమ్మకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు’

NLR: మాజీ ఎంపీ, కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ మృతి పట్ల రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి బుధవారం సంతాపం ప్రకటించారు.రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అంత్యక్రియల ఏర్పాట్ల కోసం నెల్లూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చర్చించారు.

September 26, 2024 / 06:54 AM IST

మారుమూల గ్రామంలో పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు

ASR: కొయ్యూరు మండలం డౌనూరు పంచాయతీ శివారు గ్రామమైన ముళ్ళమెట్ట పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దారు. మండల విద్యాశాఖ అధికారి రాంబాబువారి సందర్శనలో పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దిన ప్రధానోపాధ్యాయులు జి.సింహాచలంని బుధవారం ప్రశంసించారు. పాఠశాల ఆవరణలో చక్కని కిచెన్ గార్డెన్‌ను తీర్చిదిద్దారు.

September 26, 2024 / 06:52 AM IST

ముగిసిన నియోజకవర్గ స్ధాయి క్రీడా పోటీలు

ASR: అరకులోయ క్రీడా పాఠశాలలో నిన్నటి నుండి జరుగుతున్ననియోజకవర్గ స్ధాయి క్రీడలు బుధవారంతో ముగిశాయి. పోటీలను క్రీడా పాఠశాల ప్రిన్సిపాల్ మూర్తి, వివిధ ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు ప్రారంభించారు. అండర్-14, 17 విభాగాలలో జరిగే వాలీబాల్, కోకో, షటిల్, బ్యాట్మింటన్, చెస్, యోగా, కబడ్డీ సెలక్షన్సలో 612 మంది క్రీడాకారిణిలు, 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

September 26, 2024 / 06:51 AM IST

చెకుముకి సంబరాలు విజయవంతం

ప్రకాశం: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు మార్కాపురం పట్టణంలోని పాఠశాలలో విజయవంతంగా నిర్వహించారు. ప్రశ్నాపత్రాలను డాక్టర్ బి. శరత్, చింత వాణి రాధాకృష్ణ, ఏనుగుల రవికుమార్, ఇతర ముఖ్యవర్గాలు ఆవిష్కరించారు. వాసవి, సాయి బాలాజీ, నారాయణ టెక్నో వంటి పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

September 26, 2024 / 06:49 AM IST

బాదితులకు అండగా నిలిచిన మాజీ జడ్పీటీసీ

VZM: జామికి చెందిన గంగవరపు శ్రీ లక్ష్మీ(15) అనే అమ్మాయి 2 రోజుల క్రితం జామి నుంచి చిన్నాపురం వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ఆమె తలకు బలమైన గాయం కావడంతో బ్రెయిన్ ఆపరేషన్ చేయాలని వైద్యలు సూచించారు. ఆరోగ్యశ్రీ కార్డ్‌లో ఆమె లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి మాజీ జడ్పీటీసీ పెదబాబు భరోసా ఇచ్చి MRO కృష్ణలతని సంప్రదించి పరిస్థితి వివరించారు.

September 26, 2024 / 06:49 AM IST

జిల్లా స్థాయి లాంగ్ జంప్ పోటీలకు పెదగాడి విద్యార్థినిలు

VSP: AP SGF ఆధ్వర్యంలో జరుతున్న ఆటలపోటీల్లో పెందుర్తి మండలం పెదగాడి విద్యార్థినిలు హర్షవర్థిని, వైష్ణవి జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించారు. జుత్తాడ హైస్కూల్లో జరిగిన హై జంప్, లాంగ్ జంప్ పోటీల్లో ప్రతిభ చూపించారు. ఈనెల 26న విశాఖ AUలో జరగనున్న జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనడానికి అర్హత సాధించారు.

September 26, 2024 / 06:49 AM IST

‘దేవాలయాన్ని శుభ్రం చేసిన బిజెపి శ్రేణులు’

ప్రకాశం: బీజేపీ వ్యవస్థాపకులు ఆచార్య దిన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా.. బీజేపీ రాష్ట్ర నాయకులు పిలుపు మేరకు గిద్దలూరులోని రాచర్ల రోడ్డులో గల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బీజేపీ శ్రేణులు బుధవారం ఊడ్చి శుభ్రం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుందని బీజేపీ ఉపాధ్యక్షులు భవనాసి వెంకట రామాంజనేయులు వెల్లడించారు.

September 26, 2024 / 06:49 AM IST

నాలుగు సెంటర్లలో ఏపీ టెట్

NLR: ఏపీ టెట్ అక్టోబర్ 3 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ రామారావు ఓ ప్రకటనలో తెలిపారు. కావలిలోని పీబీఆర్ విశ్వోదయ ఇంజినీరింగ్ కళాశాల, పొట్టేపాళెంలోని ఆయాన్ డిజిటల్ సెంటర్, కడనూతలలోని రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, నెల్లూరులోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్ష జరగనుందన్నారు.

September 26, 2024 / 06:49 AM IST

ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ELR: పెనుమంట్ర మండలం పొలమూరులో బుధవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీలోని ముఖ్య నాయకులు పార్టీలు మారుతున్నారని, అతి త్వరలోనే ఆ పార్టీ కనుమరుగవుతుందన్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు పసుపు కుంకుమ తాంబూలాలు, బట్టలు పెట్టి ఆశీర్వదించారు.

September 26, 2024 / 06:48 AM IST

పేదల కడుపు కొట్టిన ఘనుడు జగన్: శ్రీపతిబాబు

చిత్తూరు: అన్నా క్యాంటీన్లు తొలగించి పేదల కడుపున కొట్టిన ఘనుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీపతిబాబు అన్నారు. మండల పరిధిలోని పెద్దఈటిపాకం గ్రామంలో ఎంపీడీవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టీడీపీ మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

September 26, 2024 / 06:48 AM IST

హౌసింగ్ బోర్డ్ చైర్మన్ తాతయ్య బాబును సన్మానించిన రమేష్ యాదవ్

AKP: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో భాగంగా రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ చైర్మన్గా నియమించబడిన జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబును బుచ్చయ్యపేట మండలం యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు సింగంపల్లి రమేష్ యాదవ్ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పార్టీ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేసిన తాతయ్య బాబుకు పదవి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. 

September 26, 2024 / 06:47 AM IST

అక్టోబర్ 3న రేషన్ బియ్యం వేలం

ప్రకాశం: రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తుల నుంచి జప్తుచేసిన బియ్యాన్ని వచ్చేనెల మూడో తేదీన బహిరంగ వేలం వేయనున్నట్లు, దర్శి మండల తహశీల్దార్ బుధవారం తెలిపారు. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు.. జప్తు చేయబడిన అనకొండ మండలంలోని పాయింట్ వద్ద నిలువ ఉంచిన 40.52 కిలోల రేషన్ బియ్యాన్ని బహిరంగ వేలం వేయనున్నట్లు తెలిపారు.

September 26, 2024 / 06:47 AM IST

కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంది: ఎరిక్షన్ బాబు

ప్రకాశం: కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉందని ఎర్రగొండపాలెం టీడీపీ ఇంఛార్జీ ఎరిక్షన్ బాబు అన్నారు. బుధవారం సాయంత్రం పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందించిన పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం పొలం పిలుస్తుంది, స్వర్ణాంధ్ర కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.

September 26, 2024 / 06:47 AM IST

ఉల్లి కొనగలమా..? తినగలమా..?

సాధారణంగా ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీళ్లు వస్తుంటాయి. ఇప్పుడు అవి కొనాలంటే కన్నీళ్లు వస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధర అర్ధ సెంచరీ దాటింది. 3 నెలల క్రితం కిలో రూ.20 పలికిన ధర నేడు మూడింతలు పెరిగింది. వరుసగా పండుగలు, శుభకార్యాలు ఉండటంతో.. మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో సామాన్యులు ఉల్లి వాడకాన్ని తగ్గించుకుంటున్నారు. భారీ వర్షాల వల్ల ఉల్లి సాగు తగ్గడంతో.. ధరలు పెరిగాయని వ్య...

September 26, 2024 / 06:47 AM IST