సాధారణంగా ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీళ్లు వస్తుంటాయి. ఇప్పుడు అవి కొనాలంటే కన్నీళ్లు వస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర అర్ధ సెంచరీ దాటింది. 3 నెలల క్రితం కిలో రూ.20 పలికిన ధర నేడు మూడింతలు పెరిగింది. వరుసగా పండుగలు, శుభకార్యాలు ఉండటంతో.. మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో సామాన్యులు ఉల్లి వాడకాన్ని తగ్గించుకుంటున్నారు. భారీ వర్షాల వల్ల ఉల్లి సాగు తగ్గడంతో.. ధరలు పెరిగాయని వ్యాపారస్థులు చెబుతున్నారు.