• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష

మన్యం: పాచిపెంట మండల అభివృద్ధి కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బందితో మండల ప్రత్యేక అధికారి శివ ప్రసాద్ బుధవారం సమీక్ష నిర్వహించారు. మండలంలో గృహ నిర్మాణాలపై ఆరా తీశారు. ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని లేదంటే బిల్లులు పడే అవకాశం లేదన్నారు.

September 26, 2024 / 07:18 AM IST

పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్

MBNR: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదండాపూర్ రిజర్వాయర్ పరిస్థితిని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10సం.లు అధికారంలో ఉండి రూ. 27,500 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా సాగునీటిని అందించలేదన్నారు.

September 26, 2024 / 07:18 AM IST

OTTలోకి వచ్చేసిన ‘సరిపోదా శనివారం’

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఆగస్టు 29న రిలీజై దాదాపు రూ.100 కోట్లు కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా తాజాగా OTTలోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా, ఈ మూవీలో ఎస్.జె సూర్య విలన్‌గా నటించగా.. ప్రియాంక మోహన్ హీరోయిన్&z...

September 26, 2024 / 07:17 AM IST

సమగ్ర శిక్ష ఉద్యోగులకు జీతాలు విడుదల చేయాలి

AKP: విద్యాశాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఆగస్టు, సెప్టెంబర్ నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నాయకుడు పూడి వెంకట్రావు డిమాండ్ చేశారు. రెండు నెలలుగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు జీతాలు విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.

September 26, 2024 / 07:17 AM IST

సంగడిగుంటలో నేడు విద్యుత్ అదాలత్

GNT: సంగడిగుంట విద్యుత్ భవన్‌లో గురువారం విద్యుత్ అదాలత్ జరగనుంది. గుంటూరు తూర్పు, పశ్చిమ, గుంటూరు రూరల్, పెదకాకాని మండలాలకు చెందిన విద్యుత్ వినియోగదారుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు పిలుపునిచ్చారు.

September 26, 2024 / 07:17 AM IST

ఓవర్ లోడ్‌తో వెళితే చర్యలు

HYD: రాష్ట్రంలో రవాణా శాఖలో లక్ష్యానికి అనుగుణంగా ఆదాయ మార్గాలను పెంచేందుకు ఎన్‌ఫోర్స్‌మెంటు పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం రవాణా శాఖ అధికారులతో మంత్రి సచివాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. ఓవర్ లోడ్‌తో  విద్యార్థులను తీసుకెళ్తున్న వాహనాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

September 26, 2024 / 07:17 AM IST

త్వరలోనే మరిన్ని పోస్టులకు నోటిఫికేషన్

TG: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగ ఖాళీలు వేగంగా భర్తీ అవుతున్నాయి. గడిచిన 15 రోజుల్లోనే 4 వేల పోస్టులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. మరో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇంకో పది రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనుంది. మరో 1600 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కూడా ఆర్థిక శాఖ ఆమోదం కోరుతూ ఆరోగ్యశాఖ ఫైల్ పంపింది.

September 26, 2024 / 07:15 AM IST

జీవీఎంసీ సర్వసభ్య సమావేశం నేటికి వాయిదా

VSP: జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం గురువారానికి వాయిదా పడింది. మంగళవారం ప్రారంభమైన కౌన్సిల్ సమావేశంలో 11 అంశాలకు ఆమోదం లభించిందని మేయర్ హరి వెంకట కుమారి బుధవారం తెలిపారు. సమయాభావం వలన మహిళా కౌన్సిల్ సభ్యులు అభ్యర్థన మేరకు ఈ సమావేశం గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేసినట్లు వివరించారు.వర్షాలపై కౌన్సిల్లో చర్చ జరగనున్నట్లు తెలిపారు.

September 26, 2024 / 07:15 AM IST

పుంగనూరులో వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

చిత్తూరు: పుంగనూరులో బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు బుధవారం పోక్సో కేసు నమోదు చేశారు. మండలానికి చెందిన చెందిన విజయ భాస్కర్ ఓ బాలిక(17)కు మాయ మాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక ప్రస్తుతం చికిత్స పొందుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

September 26, 2024 / 07:15 AM IST

కులగణన, నాలుగు రోజుల్లో గైడ్ లైన్స్: టీపీసీసీ అధ్యక్షుడు

HYD: కులగణన కోసం నాలుగు రోజుల్లో గైడ్ లైన్స్ విడుదల చేస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం బేగంపేటలో కుల గణనపై బీసీ సంఘాల రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరిగింది. BJPకి చిత్తశుద్ధి ఉంటే దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలన్నారు.

September 26, 2024 / 07:14 AM IST

కొత్తచెరువు పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే యెన్నం

MBNR: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కొత్త చెరువు అలుగు పారుతున్న విషయాన్ని డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ ద్వార సమాచారం తెలుసుకునిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బుధవారం అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించారు. అంతకు ముందు మడుగు నగర్ కాలనీలో కొత్త చెరువు నుంచి వచ్చే నీటిని ఆయన పరిశీలించారు.

September 26, 2024 / 07:13 AM IST

మాజీ సీఎం జగన్‌ను కలసిన ప్రసాద్ రెడ్డి

ప్రకాశం: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని ప్రకాశం జిల్లా మాజీ డీసీసీబీ ఛైర్మన్ వై.ఎం.ప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేము”వైసీపీ”లోనే కొనసాగుతామని ప్రసాద్ రెడ్డి జగన్‌కు వెల్లడించారు. వైసీపీలోనే తమకు పదవులు, గౌరవందక్కాయని అలాంటి పార్టీని, జగన్‌ను విడిచి వెళ్ళమని ప్రసాద్ రెడ్డి స్పష్టంచేశారు.

September 26, 2024 / 07:12 AM IST

పారిశుద్ధ్య కార్మికులను నియమించుకోవాలి: డీఈఓ

WNP: ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులను నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేశామని బుధవారం వనపర్తి జిల్లాలో డీఈఓ డా. గోవిందరాజులు అన్నారు. వారి వేతనాలకు సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. మధ్యాహ్న భోజనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునేలా ప్రధానోపాధ్యాయులు ఏర్పాట్లు చేయాలని అన్నారు.

September 26, 2024 / 07:10 AM IST

అణు దేశాలకు పుతిన్ వార్నింగ్

ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ.. పశ్చిమ దేశాలకు రష్యా గట్టి హెచ్చరిక చేసింది. అణ్వస్త్రాలు లేని దేశం చేసే దాడికి మరో దేశం మద్దతిస్తే రెండు దేశాలు కలిసి చేసినట్లుగానే భావిస్తామని అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. అయితే అలాంటి దాడులకు ప్రతిస్పందనగా అణ్వాయుధాలు ప్రయోగిస్తారా అనే విషయాన్ని పుతిన్ వెల్లడించలేదు.

September 26, 2024 / 07:10 AM IST

సీఎంఆర్ఎఫ్ ఎల్‌ఓసీలను అందజేసిన MLA

HYD: లబ్ధిదారులకు ముఖ్య మంత్రి సహాయ నిధి ఎల్‌ఓసీలను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. మాదాపూర్ డివిజన్ పరిధి ఆదిత్యనగర్ కాలనీకి చెందిన మహమ్మద్ హుస్సేన్‌కు రూ.1,50,000, వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని సుమిత్రనగర్ కాలనీకి చెందిన లక్ష్మీకి రూ. 1,25,000 మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు.

September 26, 2024 / 07:10 AM IST