• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రాజమండ్రిలో ఇద్దరి అరెస్ట్

కాకినాడ: పండ్ల వ్యాపారి మణికంఠను కత్తితో బెదిరించి దొంగతనానికి పాల్పడిన కేసులో కొంతమూరుకు చెందిన బలరామ్, యేసు అనే పాత నేరస్థులను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ బుధవారం తెలిపారు. రాజమహేంద్రవరంలో ఎస్పీ తెలిపిన వివరాలు.. ఈ నెల 22న రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితులు దొంగతనానికి పాల్పడ్డారు.

September 26, 2024 / 07:39 AM IST

నేడు జిల్లాలో మంత్రి కొండా సురేఖ పర్యటన

MDK: ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌ఛార్జ్ , రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ నేడు(గురువారం)మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మెదక్ కలెక్టరేట్‌లోని జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అంతకు ముందు నర్సాపూర్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.స్థానిక ఎమ్మెల్యే సమావేశానికి హాజరుకానున్నారు.

September 26, 2024 / 07:39 AM IST

ఇసుక అక్రమ రవాణాదారులు రిమాండ్: ఎస్సై

SRCL: ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని రవాణాకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను రిమాండ్‌కు తరలించినట్టు ముస్తాబాద్ ఎస్సై గణేష్ తెలిపారు. ముస్తాబాద్ మండలం ఆవునూరు వద్ద మానేరు వాగు నుంచి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్సై పేర్కొన్నారు.

September 26, 2024 / 07:39 AM IST

‘దేవర’ హాలీవుడ్‌ సినిమాలను గుర్తుచేస్తుంది: అనిరుధ్

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రూపొందిన ‘దేవర’ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ మూవీ సంగీత దర్శకుడు అనిరుధ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ సినిమా హాలీవుడ్ సినిమాలను గుర్తుచేస్తుందని.. కచ్చితంగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారని అన్నాడు. చాలా సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయని చెప్పాడు. అభిమానులతో కలిసి తనకు ఈ సినిమా చూడాలనుందని ...

September 26, 2024 / 07:39 AM IST

‘వంద రోజుల్లోనే ప్రజలకు ఎంతో మేలు చేశాం’

పల్నాడు: అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే ప్రజలకు ఎంతో మేలు చేసి చూపించామని ఎమ్మెల్యే డా. చదలవాడ అరవిందబాబు అన్నారు. నరసరావుపేట పట్టణంలోని 15,16,17 వార్డుల్లో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి.. వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఈ మేరకు స్థానిక సమస్యలపై ఆరా తీశారు.

September 26, 2024 / 07:38 AM IST

‘టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన యువజన కాంగ్రెస్ నాయకుడు’

ADB: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మకంటి మహేష్ కుమార్ గౌడ్‌ను యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో బుధవారం టీపీసీసీ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

September 26, 2024 / 07:37 AM IST

అలుగుపై నుంచి పారుతున్న వరద నీరు

KMR: సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు అలుగుపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. బుధవారం రాత్రి తాడ్వాయి మండలంలోని సంగోజీవాడి, కాళోజివాడి, బ్రాహ్మణపల్లి ప్రాంతాల్లో వర్షం అధికంగా కురవడంతో చెరువులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. చెరువులో నీరు పూర్తిస్థాయిలో నిండడంతో అలుగు ద్వారా నీరు బయటకు వెళుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.

September 26, 2024 / 07:37 AM IST

నిజాంసాగర్‌లో చిరుత సంచారం

KMR: నిజాంసాగర్ మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో నర్సింగ్ రావ్ పల్లి చౌరస్తా – నిజాంసాగర్ రహదారిపై గల సైలాని బాబా దర్గాకు సమీపంలో చిరుత రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లినట్లు వాహనదారులు తెలిపారు. అచ్చంపేట్ మోడల్ స్కూల్, మాగి ఫ్యాక్టరీ ప్రాంతాల్లో గతంలో చిరుత సంచరించిన విషయం తెలిసిందే.

September 26, 2024 / 07:36 AM IST

“మహిళలు అన్ని రంగాలలో సాధికారత సాధించాలి”

JN: మహిళలు ఆర్థికంగా, సామజికంగా,సాంకేతికంగా అభివృద్ధి సాధించినప్పుడే మహిళా సాధికారత సాధ్యపడుతుందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ జిల్లా మహిళా సమాఖ్య 8వ వార్షిక మహాసభకు బుధవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో కలిసి ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

September 26, 2024 / 07:34 AM IST

‘ప్రభుత్వ పథకాల ప్రచారంలో స్థానికులకు అవకాశం’

AKP: నర్సీపట్నంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచార కళాకారుల సంఘం సభ్యులు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పథకాల ప్రచారంలో స్థానికులుకు అవకాశం ఇవ్వాలని వినతిపత్రంలో కోరారు. గత టీడీపీ ప్రభుత్వంలో బకాయి ఉన్న రూ.36 లక్షలు విడుదలయ్యేలా చూడాలని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన స్పీకర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.

September 26, 2024 / 07:34 AM IST

గొడిచెర్లలో విషాదఛాయలు

AKP: నక్కపల్లి మండలం గొడిచర్ల గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఉద్దండపురం హైవే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆవాల నవీన్ (19), కిల్లాడ నాగేశ్వరరావు (22) బైక్పై వెళ్తూ లారీని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఇద్దరు యువకులు పొలం పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు.

September 26, 2024 / 07:33 AM IST

కలెక్టర్‌ను కలిసిన ప్రత్యేక తహశీల్దార్ ఠాగూర్

KKD: మలికిపురం మండల రెవెన్యూ అధికారిగా పనిచేస్తూ సాధారణ బదిలీలలో భాగంగా కాకినాడ రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ప్రత్యేక తహశీల్దార్‌గా G.R. ఠాగూర్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో కాకినాడ కలెక్టర్ షణ్మోహన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్‌కు మొక్కను అందజేశారు.

September 26, 2024 / 07:33 AM IST

నేడు పుల్కల్ సొసైటీ మహా జన సభ

కామారెడ్డి: బిచ్కుంద మండలంలోని పుల్కల్ సొసైటీలో గురువారం మహాజన సభను నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి సాయి ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మహాజన సభలో సంఘ జమా ఖర్చులు చేపడుతున్న పనులు ఇతర వివరాలను చర్చించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి రైతులు, ప్రజా ప్రతినిధులు హాజరుకావాలని కార్యదర్శి సాయి ప్రకాష్ కోరారు.

September 26, 2024 / 07:33 AM IST

పేకాట స్థావరంపై దాడులు: సీఐ

SRCL: ఓ ఇంట్లో జూదం ఆడుతున్న ఎనిమిది మందిని పట్టుకున్నట్లు సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ ప్రకటన విడుదల చేశారు. పట్టణంలోని రాజీవ్ నగర్‌లో వంతడుపుల సుధాకర్ నివాసంలో జూదం ఆడుతున్నారన్న పక్క సమాచారంతో తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. ఎనిమిది మందిని పట్టుకుని వారి వద్ద నుంచి 38,200 నగదు, ఎనిమిది చరవాణిలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

September 26, 2024 / 07:33 AM IST

దరఖాస్తుల ఆహ్వానం

ADB: పట్టణంలోని బంగారి గూడలోని ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో అవర్లీ బేస్డ్ ప్రాతిపదికన పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శివాజీ ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో కామర్స్, పీజీటీ ఖాళీగా ఉందని, అభ్యర్థులు ఎంకామ్, బీఈడీ పూర్తి చేసిన వారు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

September 26, 2024 / 07:32 AM IST