SRCL: ఎల్లారెడ్డిపేట మండలం కంచర్ల గ్రామానికి చెందిన 2009 బ్యాచ్ పోలీస్ కానిస్టేబుల్ దిలీప్ అకాల మరణం ఆ బ్యాచ్ సభ్యులను కలచివేసింది. గురువారం దిలీప్ కుటుంబాన్ని పరామర్శించిన తోటి బ్యాచ్‌మేట్స్, వారి పిల్లల చదువుల కోసం రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గంపల సతీష్, గొర్రె తిరుపతి, ఆకుల సతీష్, ముజాల కైలాష్, అనిల్, తీగల మహేష్ ఆధ్వర్యంలో ఈ నగదును అందజేశారు.