WGL: కాకతీయ మెడికల్ కాలేజీ(KMC)లో వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వర్తించేందుకు 68 అసిస్టెంట్ ప్రొఫెసర్, 4 సీఏఎస్ ఆర్ఎంఓ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. రాంకుమార్‌రెడ్డి తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1.25 లక్షలు వేతనం చెప్పారు. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 3 వరకు కాలేజీలో సంప్రదించాలని సూచించారు.
NZB: నగర నడిబొడ్డున సరస్వతి నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జూదం ఆడుతున్న ఐదుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ. 15 వేల నగదుతోపాటు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం సాయంత్రం జూదం అడ్డాపై పోలీసులు దాడి చేశారు. అక్కడ జూదం ఆడుతున్న వారిని చూసి ఖంగుతిన్నారు. అనంతరం వారిని అరెస్టు చేశారు.
SKLM: లావేరు మండలం కొత్త రౌతు పేట గ్రామంలోని MPUP స్కూల్ పూర్తిగా జలమయమయింది.ఏ చిన్నపాటి వర్షం పడినా వర్షపు వరద నీటితో పాఠశాల నిండిపోతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక పెద్దపెద్ద వర్షాలు ఐతే పూర్తిగా ఇబ్బంది కలుగుతుందన్నారు. పిల్లల చదువుకు ఆటంకం కలుగుతుందన్నారు. సంబంధిత అధికారులు స్పందించి పరిష్కారం చేయాలని కోరుతున్నారు
గుంటూరు: మైనర్ బాలికను వేధిస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు మంగళగిరి రూరల్ ఎస్ఐ సీ. హెచ్. వెంకట్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మంగళగిరి పరిధిలో ఆత్మకూరుకు చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన చింతలచెరువు జగపతిబాబు కొంతకాలంగా వేధిస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
KMM: భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్ నుంచి నడిచే రెండు రైళ్లు గురువారం నుంచి రద్దు చేస్తున్నట్టు చీఫ్ కమర్షియల్ అధికారి జేమ్స్‌ఫల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెల్లవారుజామున నడిచే సింగరేణి ఎక్స్‌ప్రేస్ అక్టోబర్ 8 వరకు, కాకతీయ ఎక్స్‌ప్రేస్ అక్టోబర్ 7 వరకు రద్దు చేశామని వెల్లడించారు. వరంగల్లో జరుగుతున్న మరమ్మతుల పనుల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు.
GDWL: ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామంలోని సబ్సిడీ గ్యాస్ లబ్దిదారుల ధ్రువపత్రాలను ఎమ్మెల్యే విజయుడు స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగించుకోవాలన్నారు. గ్యాస్ సబ్సిడీలో ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించి పరిష్కరించుకోవాలని సూచించారు.
కరీంనగర్: ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనలో భాగంగా హుజురాబాద్ పట్టణంలో లబ్ధిదారుడు వేణుకి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి చేతుల మీదుగా వడ్రంగి పనిముట్ల కిట్‌ను అందజేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు, జిల్లా కార్యదర్శి నర్సింహ రాజు, కర్ణాకర్, అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్, కౌన్సిలర్ వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షులు పాల్గొన్నారు.
NLR: అత్యవసర సమయాల్లో పోలీసులకు చేసే 100 నంబర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 112గా మారిందని ఆత్మకూరు DSP వేణుగోపాల్ తెలిపారు. ఆత్మకూరు సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత 100 నంబర్ తెలంగాణకు వెళ్లిందని, 112 నంబర్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందని తెలిపారు.
JN: కొడకండ్ల మండలానికి నూతనంగా వచ్చిన ఎస్సై చింత రాజును పాలకుర్తి నియోజకవర్గ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ధరావత్ రాజేష్ నాయక్, మండల ఎస్టీ సెల్ నాయకుడు భాస్కర్ నాయక్, రవి, హరిచందర్, భిక్షపతి, శ్రీకాంత్, వినోద్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
JN: బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి జిల్లా ఉపాధిశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని ఉపాధి కార్యాలయంలో నిరుద్యోగులకు జాబ్‌మేళా జనగామ పట్టణంలోని రజకవాడలో నిర్వహించి ఎల్లమ్మ జయంతి కార్యక్రమంలో పాల్గొననున్న కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా పాడి రైతుల సమస్యలను పరిష్కరించాలని తరలనున్న రైతుల సంఘం నాయకులు.
WNP: వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన బొల్లి ఈశ్వరమ్మకు కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా మంజూరైన రూ. 1,00116 చెక్కును బుధవారం తహశీల్దార్ వరలక్ష్మీకి అందజేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. మహిళలలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ATP: వజ్రకరూరు మండల కేంద్రంలోని గడే హోతూరు పీహెచ్సీలో అంతర్జాతీయ ఫార్మసిస్ట్ డే సందర్భంగా ఫార్మసిస్ట్ విధులు నిర్వహిస్తున్న బాలయ్యకు గుంతకల్ రెడ్ డ్రాప్ బ్లడ్ ఆర్గనైజేషన్ ఫౌండర్ రెహమాన్ శాలువాతో సత్కరించారు. రెహమాన్ మాట్లాడుతూ.. ప్రముఖ సంఘ సేవకుడు, కారుణ్య హెల్పింగ్ హాండ్స్ ఫౌండర్ బాలయ్య 85 సార్లు రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నారన్నారు.
KRNL: స్థానిక ఔట్ డోర్ స్టేడియం నందు శనివారం ఉదయం 9 గంటలకు జిల్లాస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఈ పోటీలకు 8, 9, 10 తరగతి విద్యార్థులు అర్హులని కర్నూల్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి లోకేష్ తెలిపారు. మరిన్ని వివరాలకు 9505157553 సంప్రదించాల్సిందిగా కోరారు.
ADB: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 286.50మీటర్లు కాగా, ప్రస్తుతం 285.20మీటర్లుగా ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టుకి 100క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉందన్నారు.
AP: విజయనగరంలోని వాల్మీకి రీసెర్చ్ సెంటర్‌ను ఇవాళ ప్రారంభించనున్నారు. సాయంత్రం 5 గంటలకు రామనారాయణంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. నాలుగు రోజులపాటు వాల్మీకి రామాయణంపై సదస్సులు నిర్వహించనున్నారు. విజయనగరం జిల్లాకు 6 కి.మీ. దూరంలో NCS ఛారిటబుల్ ట్రస్టు దీన్ని తీర్చిదిద్దింది. రామాయణంలోని వివిధ ఘట్టాలను ఆవిష్కరించారు. ఈ కేంద్రాన్ని ట్రస్టు సభ్యులు జాతికి అంకితం చే...