• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రేపు అధికారికంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమం

ADB: తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం అధికారికంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీపార్క్ పక్కన గల బాపూజీ విగ్రహం వద్ద ఉదయం 10:30 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

September 26, 2024 / 07:57 AM IST

గన్నవరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

కృష్ణా: గన్నవరం సమీపంలోని చెన్నై-కోల్‌కత్తా హైవేపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి వస్తున్న కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులు బాపట్ల జిల్లా కోటపాడుకు చెందిన మార్క్(25), మేరీ(38)గా గుర్తించారు. క్షతగాత్రుల్ని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

September 26, 2024 / 07:56 AM IST

ఏడుపాయలలో కొనసాగిన వరద ఉధృతి

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం ఎదుట వరద ఉదృతి గురువారం కొనసాగింది. ఎగువ నుండి మంజీరా నది ఉప్పొంగడంతో దిగువకు జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. మూడోరోజు కూడా ఆలయాన్ని మూసివేసి రాజగోపురం వద్ద అమ్మవారికి పూజలు చేస్తున్నారు. ప్రధాన ఆలయం వైపుభక్తులు ఎవరిని వెళ్లనివ్వకుండా ఆలయ కమిటీ అధికారులు చర్యలు తీసుకున్నారు.

September 26, 2024 / 07:56 AM IST

రిటైర్మెంట్ అంగన్వాడీలకు సన్మానం

NGKL: బిజినేపల్లి మండల పరిధిలోని ఆయా గ్రామాలలో విధులు నిర్వహిస్తూ పదవి విరమణ పొందిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలను బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గంగారం, వట్టెం అంగన్వాడీ టీచర్లు వరలక్ష్మి, ఇందిరమ్మ, వట్టెం, మంగనూరు, ఖానాపూర్ మైసమ్మ, నాగమ్మ, జాఫర్ బిలను సీడీపీఓ సంగీత, ఎంపీడీవో ఖాతాలప్ప పూలమాలలో శాలువాలతో ఘనంగా సన్మానించారు.

September 26, 2024 / 07:56 AM IST

మెగా లోక్ అదాలత్ విజయవంతం చేయండి : రాజేష్ బాబు

NGKL: కల్వకుర్తి పట్టణంలోని కోర్టు ఆవరణలో ఈ నెల 28 న జరిగే మెగాలోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా జడ్జి రాజేష్ బాబు బుధవారం అన్నారు. కోర్టు ఆవరణలో బుధవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసాదించారు. 28న జరిగే మెగా లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యే విధంగా న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది కృషి చేయాలని ఆయన కోరారు.

September 26, 2024 / 07:55 AM IST

మహిళా క్రికెటర్లను కలిసిన రానా

అక్టోబర్ 3 నుంచి యూఏఈ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో హర్మన్ ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత మహిళా జట్టు దుబాయ్ చేరుకుంది. అయితే ఎయిర్‌పోర్టులో హీరో దగ్గబాటి రానా అనుకోకుండా క్రికెటర్లను కలిశాడు. ఈ క్రమంలో వారికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. కప్ గెలిచి దేశానికి తీసుకురావాలని.. కచ్చితంగా సాధిస్తారని వారితో సంభాషించాడు. అనంతరం వారితో కలిసి ఫొటోలు దిగాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు...

September 26, 2024 / 07:54 AM IST

భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

నారాయణపేట: జిల్లాలో భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్‌లో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులపై రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కొత్తగా బాధ్యతలు చేపట్టిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సీహెచ్ విశాలాక్షీ, ఎసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

September 26, 2024 / 07:51 AM IST

తాడిపత్రి మండలంలో ముగ్గురి అరెస్టు

ATP: తాడిపత్రి మండలంలోని ఊరు చింతల గ్రామం వద్ద గత నెల 27న అక్రమంగా ఇసుకను తరలిస్తున్న సూర్యనారాయణరెడ్డి, మల్లికార్జునరెడ్డి, మారుతిలను బుధవారం అరెస్ట్ చేసినట్లు రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు. అప్పట్లో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామన్నారు. అందులో భాగంగా వీరిని కడప రోడ్డులో అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు.

September 26, 2024 / 07:51 AM IST

నేడు పెసల కొనుగోలు బంద్

KMM: జిల్లాలో వర్షాలు కురుస్తున్న కారణంగా గురువారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పెసల కొనుగోలు ఉందని మార్కెట్ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. మళ్ళీ ఈ నెల 27న తిరిగి కొనుగోలు ప్రారంభిస్తామన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

September 26, 2024 / 07:49 AM IST

మాజీ మంత్రి కేటీఆర్ ను కలిసిన రవీంద్ర కుమార్

NLG: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి KTRను బీఆర్ఎస్ పార్టీ NLG జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ MLA రమావత్ రవీంద్ర కుమార్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఉన్నారు.

September 26, 2024 / 07:48 AM IST

మండల పీఆర్టీయూ టీఎస్ కమిటీ ఎన్నిక

WGL: గూడూరు మండలం ప్రోగ్రెసివ్ రికాగ్ నైజ్డ్ టీచర్స్ యూనియన్ పీఆర్టీయూ గూడూరు మండల శాఖ అధ్యక్షులు ఊక లక్ష్మయ్య అధ్యక్షతన సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. గూడూరు మండల ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వర్లు వేదికను సమర్పించగా కార్యవర్గం, ప్రాథమిక సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

September 26, 2024 / 07:48 AM IST

ఘనంగా ప్రపంచ ఫార్మసిస్ట్ డే వేడుకలు

NRPT: జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ప్రపంచ ఫార్మసిస్ట్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న ఫార్మసిస్ట్‌లకు శాలువాతో ఘనంగా సన్మానించారు. జిల్లా వైద్య శాఖ అధికారి సౌభాగ్య లక్ష్మీ మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో వైద్యులు ఎంత కీలకమో ఫార్మసిస్ట్‌లు అంతే కీలకమని అన్నారు.

September 26, 2024 / 07:48 AM IST

వెలగని వీధిలైట్లు..అంధకారంలో శ్రీనివాస్‌నగర్

SKLM: టెక్కలి శ్రీనివాస్ నగర్ అంధకారంలో ఉంటుందని స్థానికులు అంటున్నారు. కొద్దీ రోజులుగా శ్రీనివాస్ నగర్‌లో వీధిలైట్లు వెలగకపోతుండడంతో చీకటి నెలకొంటుందని పలువురు వాపోతున్నారు. వీధిలైట్లు లేక రాత్రి సమయాల్లో అటుగా వెళ్లే వారిపై కుక్కలు వెంబడిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. అధికారులు స్పందించి వీధిలైట్లు మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.

September 26, 2024 / 07:47 AM IST

“పరిశుభ్రత అనే సేవను అందరూ చేయాలి”

WGL: పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకున్నప్పుడే ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు అన్నారు. బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన స్వచ్స్ హై సేవా కార్యక్రమంలో జడ్జి పాల్గొని కోర్టు సిబ్బంది న్యాయవాదులతో కలిసి పరిసరాలను శుభ్రపరిచారు. హై కోర్ట్ ఆదేశాల మేరకు స్వచ్ హై సేవా కార్యక్రమం జరుగుతుందన్నారు.

September 26, 2024 / 07:47 AM IST

శ్రీశైలం డ్యామ్‌.. ఇన్ ఫ్లో 96,052 క్యూసెక్కులు

AP: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇన్ ఫ్లో 96,052 క్యూసెక్కులు రాగా, అవుట్ ఫ్లో 35,315 క్యూసెక్కులు దిగువన నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు విడుదలవుతుంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 875.80 అడుగులు ఉంది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. 

September 26, 2024 / 07:47 AM IST