KMM: వరద బాధితులను ఆదుకునేందుకు సిరి సీడ్స్ ప్రైవేటు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిన మురళీకృష్ణ, వివేకానంద్ అరిమిల్లి, రాకేశ్ రెడ్డి రూ.5 లక్షల చెక్కును మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అందజేశారు. వరద ముంపు బాధ్యత ప్రాంతాల వారికి సిరి సీడ్స్ తమ వంతు సహాయం అందజేయడం అభినందనీయం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
RR: సొంతవారి నిరాదరణ వల్ల నిరాశ్రయులై కాలం వెళ్లదీస్తున్న వనస్థలిపురం రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ ఉచిత వృద్ధాశ్రమంలోని వృద్ధులు సంతోషంగా ఉండాలని భువనేశ్వరి ప్రాపర్టీస్ CEO ఆనందస్వామి TVని అందజేశారు. TVల్లో ప్రోగ్రామ్స్ చూస్తూ ఆనందంగా ఉండాలని TVని అందజేసిన ఆనంద స్వామి కుటుంబానికి భగవంతుడు ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించాలని వృద్ధులు కోరుకున్నారు.
కోనసీమ: రాయవరం మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో అక్టోబర్ 3 నుంచి 12 వరకు 53వ శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజులు వేలాది మంది భక్తులు హాజరై పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని ఆలయ సిబ్బంది పేర్కొన్నారు.
ELR :ఏలూరు ఏఎస్ఆర్ మైదానంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన అండర్-14, 17 విభాగాల్లో నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో కైకరం హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఆయా విభాగాల్లో దీవెనకుమార్, సందీప్, సుభాష్, మేరీ, యశ్వంత్, ప్రేమకుమార్, ఆంజనేయస్వామి జిల్లా జట్లకు అర్హత సాధించారు.
GDWL: రాజోళి మండలంలోని సుంకేసుల డ్యాంకు బుధవారం ఎగువ నుంచి 15,882 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. మూడు గేట్లను ఎత్తి దిగువకు 13.437 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సుంకేసుల డ్యాం నుంచి కేసీ కెనాల్‌కు 2,445 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు జేఈ రాజు బుధవారం తెలిపారు.
ప్రకాశం: జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బందిని ఒప్పంద, అవుట్ సోర్సింగ్ విధానంలో నియామకాలు చేపడుతున్నట్లు డీఈవో డి. సుభద్ర పేర్కొన్నారు. బోధనా సిబ్బందిని ఒప్పంద విధానంలో, బోధనేతర సిబ్బందిని అవుట్ సోర్సింగ్ కింద 2024-25 సంవత్సర కాలానికి భర్తీ చేస్తామన్నారు. మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రూ.250 చెల్లించాలన్నారు.
NLR: గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో గురువారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
NRML: వారసంతలలో సెల్ ఫోన్ దొంగలు రెచ్చిపోతున్నారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని వారసంతలో సెల్‌ఫోన్ చోరీ చేస్తున్న ఓ దొంగను స్థానికులు పట్టుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం వారసంతలో కూరగాయలు కొనడానికి వచ్చిన ఓ వ్యక్తి వద్ద నుండి సెల్ ఫోన్‌ను దొంగిలిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.
కృష్ణా: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఈరోజు ఘంటసాల మండలంలో పర్యటిస్తారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగానికి నిరసనగా ఉదయం 9 గంటలకు శ్రీకాకుళంలో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు దేవాలయంలో పూజ, సంప్రోక్షణలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు అని పార్టీ శ్రేణులు తెలిపాయి.
VSP: వడ్డాదికి చెందిన యర్రా హేమలత ఫార్మా డీలో గోల్డ్ మెడల్ సాధించింది. రాము, దేవి దంపతుల ప్రథమ కుమార్తె హేమలత కాకినాడలోని ఓ కాలేజీలో ఫార్మా-D కోర్సు పూర్తి చేసింది. కష్టపడి చదివి మంచి మార్కులతో గోల్డ్ మెడల్ సాధించింది. కాలేజీలో 133 మంది విద్యార్థుల్లో ఇద్దరు విద్యార్థులకు ఈ అవకాశం కలిగిందని విద్యార్థిని హేమలత తెలిపింది.
WNP: ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 లక్షల మందిని వలస పాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. బుధవారం మంత్రులు, ఎమ్మెల్యేలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శన నేపథ్యంలో పేర్కొన్నారు. ఆంధ్ర రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేసి పాలమూరును ఎడారిగా మార్చారని పేర్కొన్నారు.
కర్నూల్: ఆదోని మెజర్ పంచాయితీ పెద్ద హరివణం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నాయకుడు మాన్వి దేవేంద్రప్ప బుధవారం నిర్వహించారు. కూటమి 100 రోజుల పాలనలో ఉచిత ఇసుక, పింఛ్ పెంపు వంటి అనేక హామీలను నెరవేర్చామని చెప్పారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు.
VSP: ప్రపంచ పర్యాటక దినోత్సవం నేపథ్యంలో జిల్లాలోని చారిత్రక ప్రదేశాల ప్రాముఖ్యతను, విశిష్టతను తెలిపేలా గురువారం విశాఖ టౌన్ హాలు నుంచి మొదలుకొని వివిధ ప్రాంతాల మీదుగా హెరిటేజ్ వాక్ నిర్వహించినట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించారు. హెరిటేజ్ వాక్ను విజయవంతం చేయాలని కోరారు.
ప్రకాశం: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని కూటమిలోకి చేర్చుకోవద్దని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు ముత్తన శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం ఒంగోలులోని మిరియాలపాలెంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద చెవిలో పూలు పెట్టుకొని, మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
SRD: తెలంగాణ సాయుధ పోరాటం వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకొని నారాయణఖేడ్ పట్టణానికి చెందిన లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ రావి ఆకుపై చాకలి ఐలమ్మ చిత్రాన్ని రూపొందించి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన ధైర్యశాలి అని కొనియాడారు. ఆకుపై చిత్రంతో ఐలమ్మకు నివాళి అర్పించారు.