ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ.. పశ్చిమ దేశాలకు రష్యా గట్టి హెచ్చరిక చేసింది. అణ్వస్త్రాలు లేని దేశం చేసే దాడికి మరో దేశం మద్దతిస్తే రెండు దేశాలు కలిసి చేసినట్లుగానే భావిస్తామని అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. అయితే అలాంటి దాడులకు ప్రతిస్పందనగా అణ్వాయుధాలు ప్రయోగిస్తారా అనే విషయాన్ని పుతిన్ వెల్లడించలేదు.
HYD: లబ్ధిదారులకు ముఖ్య మంత్రి సహాయ నిధి ఎల్‌ఓసీలను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. మాదాపూర్ డివిజన్ పరిధి ఆదిత్యనగర్ కాలనీకి చెందిన మహమ్మద్ హుస్సేన్‌కు రూ.1,50,000, వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని సుమిత్రనగర్ కాలనీకి చెందిన లక్ష్మీకి రూ. 1,25,000 మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు.
ప్రకాశం: చీమకుర్తి మండలం రామతీర్థం సమీపాన నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్ గురువారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే బిన్ విజయ్ కుమార్ ప్రారంభించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలు తెలిపారు. రూ. 3.50 కోట్లతో నిర్మించిన ఈ 33/11కేవి సబ్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో విస్తరించిన గ్రానైట్ పరిశ్రమలకు విద్యుత్ లో వోల్టేజ్ లేకుండా ఉండనున్నదని తెలిపారు.
HYD: అఖిలభారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం ఆధ్వర్యంలో గురువారం నారాయణగూడలోని పద్మశాలి భవన్‌లో ఉదయం 10గంటలకు ‘బీసీ కుల సంఘాల ఐక్యత’ పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, రాజకీయ విభాగం అధ్యక్షుడు బొల్ల శివ శంకర్ తెలిపారు. బుధవారం నారాయణగూడలోని పద్మశాలి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
SRD: సింగూర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతమైన కర్ణాటకలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయంలో 12,128 క్యూసెక్కుల వరద కొనసాగుతోందని ప్రాజెక్టు ఏఈ మహిపాల్‌రెడ్డి గురువారం ప్రకటించారు. యావరేజ్ అవుట్ ఫ్లో 11,446 క్యూసెక్కులు ఉందని చెప్పారు. ప్రస్తుత ప్రాజెక్టు లెవెల్ 523.600 గాను 523.585 మీటర్ల వద్ద నిలువ ఉందన్నారు.
HYD: దసరా, దీపావళి వరుస పండుగల నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. రాజ్కోట్-మహబూబ్‌నగర్, షాలీమార్-చెన్నై స్టేషన్ల మధ్య అక్టోబర్ 7 నుంచి నవంబర్ 20 వరకు ప్రత్యేక రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయని పేర్కొన్నారు. హుబ్లీ-హైదరాబాద్, విజయపుర-హైదరాబాద్ స్టేషన్ల మధ్య పలు రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు.
HYD: రిటైర్డ్ ఎంప్లాయిస్‌కు ఆరోగ్య భద్రతను వర్తింప చేయాలని తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రావు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.శ్రీనివాస్ రావు అధ్యక్షతన బుధవారం బషీరాబాగ్ ప్రెస్ క్లబ్‌లో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది.
VZM: తెర్లాం మండలములోని అంట్లవార గ్రామంలో బుధవారం సాయంత్రం పొలములో తెగిన విద్యుత్ తీగలు కాలికి తగిలి గ్రామానికి చెందిన రైతు కోట రామారావు(48) అక్కడికక్కడే చనిపోయాడు. ఈయనకు భార్య చిన్నమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంఘటన స్థలాన్ని స్థానిక ఎస్సై బి.సాగర్ బాబు పరిశీలించి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ADB: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకులాలు, కస్తూర్బాల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా కలెక్టర్ రాజర్షిషా పోషణ చర్చా కార్య క్రమం రూపొందించారు. మండల స్థాయిలో, మున్సిపల్ స్థాయిలో అధికారులు ప్రతి వారం రెండు విద్యా సంస్థలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని ఆదేశించారు.
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై శిఖర్ స్పందించాడు. జాతీయ జట్టులో స్థానం కోసం దేశవాళీ క్రికెట్ ఆడాలనే ఉత్తేజం తనలో లేకపోవడం వల్లే రిటైరయ్యానని తెలిపాడు. “నా కెరీర్ చివరి రెండేళ్లలో పెద్దగా అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. IPLలో మాత్రమే ఆడా. ఇప్పటివరకు చాలా క్రికెట్ ఆడానని అనిపించింది. నేను సాధించిన దాని పట్ల సంతృ...
కృష్ణ: గత ప్రభుత్వంలో జరగని మంచిని ఇప్పుడు చూస్తున్నామని మాజీ శాసనసభ్యులు బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వందరోజులు సందర్భంగా పెడన నియోజకవర్గం మల్లవోలు గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మన పాస్ పుస్తకాలు మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏమిటి అని ఆయన ప్రశ్నించారు.
NLR: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు రాపూర్ మండలం పెంచలకోన లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుంటారు. సాయంత్రం 4గంటలకు సోమశిల ప్రాజెక్టు పవర్ హౌస్ పాయింట్ నుంచి ఉత్తర కాలువకు నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు.
BDK: జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 50 ఖాళీల ఉద్యోగాల భర్తీకి గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్ తెలిపారు. పదో తరగతి చదివి, 18 నుంచి 45 ఏళ్ల వయసు గల వారు అర్హులని చెప్పారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని కోరారు.
NLR : వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. గురువారం ఉదయం నుంచి అమ్మవారి నిజరూప దర్శనం చేసుకునేందుకు భక్తులు తండోపతండాలుగా ఆలయానికి చేరుకున్నారు. ఇందుకోసం దేవాదాయ శాఖ, పోలీస్ శాఖ పటిష్ఠ ఏర్పాట్లను చేశారు. సాధారణ భక్తులకు కూడా అమ్మవారి దర్శనం సులభతరంగా చేసుకునేందుకు వీలు కల్పించారు.
NLR: వెంకటగిరి పోలేరమ్మ జాతరను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో గురువారం నిర్వహించనున్న పోలేరమ్మ జాతరలో పోలేరమ్మ అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించేందుకు మంత్రి కందుల దుర్గేష్ ని నియమించినట్లు రాష్ట్ర దేవాదాయశాఖ జీవో 655విడుదల చేసిందని తిరుపతి కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ బుధవారం తెలిపారు.