KMM: గురుకుల విద్యాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నాగుర్ వలి అన్నారు. బుధవారం మధిర పట్టణంలో డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయ సిబ్బందికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల మెస్ ఛార్జీల పెంపు, గురుకులాల్లో తగిన మరుగుదొడ్ల నిర్మాణం, ఉపాధ్యాయులకు ప్రమోషన్లు వంటివి చేపట్టాలని పేర్కొన్నారు.
VZM: సాలూరు మండలం ఖరాసవలసలో ఈనెల 20న నమోదైన ఖరాసమ్మ అనుమానస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. భర్తే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు బుధవారం సాలూరు సీఐ విలేకరులతో మాట్లాడారు. ఖరాసవలసలో ఖరాసమ్మ మృతిపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. భర్త బొడ్డు దొర శ్రీనును విచారించగా చున్నీని గొంతుకు బిగించి హత్య చేసినట్లు అంగీకరించాడన్నారు.
SRCL: జిల్లాలో గురువారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం, కొదురుపాక గ్రామంలో తన అమ్మమ్మ-తాతయ్య కీ.శే. జోగినిపల్లి కేశవరావు- లక్ష్మీబాయి స్మారకార్థం నిర్మించిన ప్రాథమిక పాఠశాలను ప్రారంభిస్తారు.
ASF: జిల్లా గోలేటి సింగరేణి హైస్కూల్లో ఈ నెల 27న ఉమ్మడి ఆదిలాబాద్ అండర్-18 బాల్ బ్యాడ్మింటన్ బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి అదిలాబాద్ ప్రధాన కార్యదర్శి ఆర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో ఎంపికైన వారు అక్టోబరులో జరిగే రాష్ట్రస్థాయిలో పోటీల్లో పాల్గొంటారన్నారు. ఆసక్తిగల వారు ఫొటోలు, ఆధార్ తీసుకురావాలన్నారు.
KMM: ఆర్టీసీ సత్తుపల్లి డిపో ఆధ్వర్యంలో దివ్యాంగులకు గురువారం పెనుబల్లి మండలం వీఎం బంజార్‌లోని రాజ సాయిమందిరంలో 50శాతం రాయితీతో కూడిన బస్సు పాసులను జారీ చేయనున్నట్లు సత్తుపల్లి డిపో మేనేజర్ రాజ్యలక్ష్మీ తెలిపారు. సదరన్ సర్టిఫికెట్ జీరాక్స్, ఆధార్ కార్డు జీరాక్స్, ఒక ఫోటో తీసుకునిరావాలన్నారు. దివ్యాంగు లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
మన్యం: పాలకొండ నియోజకవర్గం సీతంపేటలోని సరస్వతి విద్యామందిర్ పాఠశాలలో పాలకొండ అగ్నిమాపక అధికారి సర్వేశ్వరరావు విద్యార్థులకు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అగ్ని నుంచి మండే వస్తువును వేరు చేసే పద్ధతి స్టార్వేషన్, మండుతున్న వస్తువు వేడిని తగ్గించే పద్ధతి కూలింగ్, మంటకు ఆక్సిజన్ అందకుండా చేసే పద్ధతి బ్లాంకెటింగ్ అని తెలియజేశారు.
బాపట్ల: ఇంకొల్లు మండల అభివృద్ధి అధికారిగా ఇప్పటి వరకు పనిచేసిన ఆర్. రాజ్యలక్ష్మి కొరిశపాడు మండలానికి బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. నూతన ఎంపీడీవోగా ఘట్ట శ్రీనివాస్ రావు ఇంకొల్లు విధులకు రానున్నారు. కార్యాలయంలో కోట శ్రీనివాసరావు సీనియర్ అసిస్టెంట్‌గా, భాస్కరరావు టైపిస్టుగా నూతనంగా భాద్యతలు స్వీకరించారు.
VZM: డెంకాడ మండలంలోని పినతాడివాడలో అల్లు అర్జున్ అభిమానులు వినూత్న రీతిలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. శ్రీ బంగారమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్భంగా మాజీ సీఎం జగన్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు గ్రామంలో వెలిశాయి. “YCP-AA MUTUAL” బ్యానర్స్ అంటూ సామాజిక మాధ్యమాల్లో యువత షేర్ చేస్తున్నారు.
కోనసీమ: కాజులూరు మండలంలో పెనుమళ్ల, ఆర్యవటం, పల్లిపాలెం గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో సహాయకురాలి నియామకానికి దరఖాస్తులు కోరుతున్నట్లు తాళ్లరేపు ఐసీడీఎస్ సీడీపీవో వి.మాధవి తెలిపారు. ఐసీడీఎస్ కార్యాలయంలో దరఖాస్తులు తీసుకోవాలని కోరారు. పూర్తి చేసిన దరఖాస్తులను అక్టోబర్ 5న సాయంత్రం అయిదు గంటలలోపు తమ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు.
KRNL: ఎమ్మిగనూరు మండల కేంద్రంలో 20వ వార్డులో గురువారం ఉదయం 11 గంటలకు జరగనున్న ‘ఇది మంచి ప్రభుత్వం’ గ్రామసభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా MLA డా.బీవీ.జయ నాగేశ్వర్‌రెడ్డి హాజరుకానున్నారు. కూటమి నేతలు, క్లస్టర్, బూత్, యూనిట్ ఇన్‌ఛార్జులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని MLA బీవీ క్యాంపు కార్యాలయం ఓ ప్రకటనలో పిలుపునిచ్చింది.
KMM: ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ఠ నిఘాతో భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేశారు. గోడౌన్ సీళ్లను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అగ్నిమాపక పరికరాలు, సీసీ కెమెరాలను పరిశీలించి, పనిచేస్తున్నవి, లేనిది అడిగి తెలుసుకున్నారు.
తిరుపతి: వరదయ్యపాలెం మండలంలో బుధవారం సాయంత్రం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాంతం బేడు, సంతవేలూరు గ్రామాల్లో పర్యటించి వరి సాగు నూతన యాజమాన్య పద్ధతులు గురించి వివరించి చర్చించారు. వ్యవసాయ శాఖ అమలుచేస్తున్న పథకాలు గురించి వివరించారు. పశువులకు వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి తెలియజేశారు.
KRNL: గూడూరు మండల పరిధిలోని నాగలాపురం గ్రామంలో గురువారం ‘ఇది మంచి ప్రభుత్వం’ గ్రామసభ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరుకానున్నారు. కూటమి నేతలు, క్లస్టర్, బూత్, యూనిట్ ఇన్‌ఛార్జులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎమ్మెల్యే దస్తగిరి క్యాంపు కార్యాలయం ఓ ప్రకటనలో పిలుపునిచ్చింది.
BDK: ప్రభుత్వ ఐటిఐ విద్యార్థులు బుధవారం ముత్యాలమ్మనగర్‌లో సంపూర్ణ స్వచ్ఛత వారోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఐటిఐ ప్రిన్సిపాల్ బి ప్రభాకర్ ప్రారంభించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంపూర్ణ స్వచ్ఛత వారోత్సవాల్లో భాగంగా ఈ వారం రోజులపాటు ఐటిఐలో పలు పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించామన్నారు.
NLR: రాష్ట్రస్థాయి కరాటే, సెపక్ తక్రా పోటీలకు అండర్-19 విభాగంలో గురువారం నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి ఈ పోటీలు ప్రారంభంకానున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.