• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గ్రామీణ స్థాయిలో సభ్యత్వం నమోదు చేయించాలి: ఎంపీ

మేడ్చల్: ఘట్‌కేసర్ మండలం ఔషాపూర్‌లో బీజేపీ నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో.. బీజేపీ సభ్యత్వ నమోదు కార్య క్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. గ్రామీణ స్థాయిలో బీజేపీ అత్యధిక సభ్యత్వం నమోదు చేయించాలని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త పట్టుదలతో కృషి చేయాలన్నారు.

September 26, 2024 / 06:18 AM IST

జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం

TG: జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టు అధికారులు ఐదు గేట్లు ఎత్తి దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 68,000 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 77,828 క్యూసెక్కులు నమోదైంది. 11 యూనిట్లలో 434 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు.

September 26, 2024 / 06:15 AM IST

‘పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం’

కోనసీమ: పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం అంటూ ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో మాస ఉత్సవాలలో భాగంగా మండల కేంద్రంలో బుధవారం గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. అమలాపురం పార్లమెంట్‌ టీడీపీ రైతు అధికార ప్రతినిధి స్థానిక ఈదల సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) సౌజన్యంతో సమకూర్చిన చీరలు, పండ్లు, స్వీట్స్‌, గాజులు 25 మంది గర్భిణీలకు అందజేశారు.

September 26, 2024 / 06:15 AM IST

13 మంది జూదరుల అరెస్టు

KDP: జిల్లాలో జూదం ఆడుతూ 13 మంది అరెస్ట్ అయ్యారు. ఎర్రగుంట్లలోని ఎరుకల కాలనీలో 8 మంది, సింహాద్రిపురం మండలం వై. కొత్తపల్లెలో ఐదుగురిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వీరినుంచి రూ. 28,530 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

September 26, 2024 / 06:15 AM IST

ఇండ్లు కూలి ఉపాధ్యాయుడు మృతి

చిత్తూరు: కార్వేటి నగరం మండలం ఆర్కేవీబీ పేట సమీపంలోని కలికిరి ఇండ్లు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు, ఎస్టీయు చిత్తూరు జిల్లా నాయకుడు పవన్ బుధవారం మృతి చెందారు. ఈ సందర్భంగా ఆయన మృతి పట్ల ఎస్టీయు చిత్తూరు జిల్లా నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్థానికులు పాల్గొన్నారు.

September 26, 2024 / 06:13 AM IST

నేడు ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ పర్యటన వివరాలు

KKD: ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ గురువారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు బుధవారం తెలిపాయి. ఉదయం 9 గంటలకు శంఖవరంలో విద్యార్థులకు బస్ పాస్ పంపిణీలో పాల్గొంటారు.  ఉదయం 10 గంటలకు శంఖవరంలో పశు వైద్యశిబిరంలో పాల్గొంటారు. ఉదయం 10:30కు మండపం గ్రామంలో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

September 26, 2024 / 06:13 AM IST

వింత వ్యాధితో 35 మేకలు మృతి

VKB: పెద్దేముల్ మండల పరిధిలోని బండమీదిపల్లిలో తెలియని మాయ రోగంతో మేకలు మృత్యువాత పడుతున్నాయి. బండమీదిపల్లికి చెందిన బాధితులు బోయిని నర్సప్ప, చాకలి కిష్టప్ప తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో సుమారు 15 రోజుల నుంచి ప్రతిరోజు ఒకటి, రెండు మేకలు మృత్యువాత పడ్డాయి. ఇప్పటి వరకు గ్రామంలో సుమారు 35 మేకలు చనిపోయాయన్నారు.

September 26, 2024 / 06:12 AM IST

పంట కాలువలపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం

తూ.గో: వైసీపీ ప్రభుత్వం పంట కాలువలు, డ్రైనేజీలను పట్టించుకోలేదని దీంతో నేడు రైతులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు. పట్టణంలోని లయన్స్‌ కల్యాణ మండపంలో రైతులు వ్యవసాయ అధికారులతో బుధవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మేరకు రైతులను ఆదుకుంటామన్నారు.

September 26, 2024 / 06:12 AM IST

నవాబ్ నజీఫ్ అలీఖాన్ను సత్కరించిన నిజాం మనవడు

మేడ్చల్: నిమ్స్ కార్డియోథొరాసిక్ ప్రొఫెసర్ గోపాల్‌ను నిజాం మనవడు నవాబ్ నజీఫ్ అలీఖాన్ ఘనంగా సత్కరించారు. ఆస్పత్రిలో బ్రిటన్ వైద్య బృందం ఆధ్వర్యంలో చిన్నారులకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. దీంతో బుధవారం ఆస్పత్రిని సందర్శించిన ఆయన బ్రిటన్ వైద్య బృందంతో పాటు ప్రొఫెసర్ గోపాల్‌ను సత్కరించి సేవల్ని మెచ్చుకున్నారు.

September 26, 2024 / 06:11 AM IST

రైతులు సేంద్రీయ ఎరువుల వాడకంపై దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే

మన్యం: రైతులు సేంద్రియ ఎరువులపై మొగ్గు చూపాలని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరీ పిలుపునిచ్చారు. బుధవారం ఆమె కురుపాం మండలం గుజ్జువాయి గ్రామంలో మండల వ్యవసాయ అదికారి ఆద్వర్యంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులు సేంద్రియ ఎరువుల వాడకంపై శ్రద్ద చూపాలని దానికి అనుగుణంగానే రైతుల కోసం సీఎం అనేక పథకాలు పెడుతున్నారన్నారు.

September 26, 2024 / 06:10 AM IST

3 షాపులపై కేసులు నమోదు

RR: నిషేధిత పాన్, గుట్కా, మసాలాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ శ్రీనివాస్ రావు అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో కిరాణా షాపులు, పాన్ డబ్బాలు, బెల్ట్ షాపులు, ఓయో రూములలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కిరాణా షాపులలో తనిఖీ చేయగా… గుట్కా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మద్యం అమ్ముతున్నట్లు గుర్తించి మూడు షాపులపై కేసులను నమోదు చేశారు.

September 26, 2024 / 06:09 AM IST

‘చర్యలు తీసుకోకుంటే విధులు బహిష్కరిస్తాం’

కాకినాడ: జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచరులపై చర్యలు తీసుకునేంత వరకూ ఉద్యమాన్ని ఆపేది లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేతో పాటు వైద్యుడిపై దాడి చేసిన 60 మందిని కూడా అరెస్ట్‌ చేయాలని బుధవారం డిమాండ్‌ చేశారు. రెండు రోజుల్లో చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు.

September 26, 2024 / 06:08 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

AP: చిత్తూరు జిల్లా మొగిలిఘాట్‌ రోడ్డులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా లారీలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఇద్దరు డ్రైవర్లతోపాటు మరొకరు సజీవదహమైనట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

September 26, 2024 / 06:08 AM IST

సెల్ఫీ పాయింట్‌ను ప్రారంభించిన కలెక్టర్

RR: రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవ కార్య క్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ పరిధిలోని నర్కుడలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా సెల్ఫీ పాయింట్‌ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక ప్రారంభించారు. అనంతరం గ్రామపంచాయతీ ఆడిటోరియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి బహుమతులను అందించారు.

September 26, 2024 / 06:07 AM IST

“ఉల్లి రైతులంతా అప్రమత్తంగా ఉండాలి”

KRNL: కోడుమూరు మండలంలో అధిక వర్షాల కారణంగా పంటకు కుళ్లు తెగులు సోకే ప్రమాదముందని ఉల్లి రైతులంతా అప్రమత్తంగా ఉండాలని ఏవో రవిప్రకాష్ సూచించారు. బుధవారం వెంకటగిరిలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఏవో నిర్వహించి, మాట్లాడారు. ఉల్లిసాగులో పాటించాల్సిన మెలకువలు, చీడపీడల, తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏవో వివరించారు.

September 26, 2024 / 06:07 AM IST