VSP: ఇతర రాష్ట్రాలకు గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను 4వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకకు చెందిన సద్దాం అహ్మద్, కె.ఎం.ప్రజ్వల్ ఒరిస్సాలో 10 కిలోల గంజాయి కొనుగోలు చేసి విశాఖ తీసుకువచ్చారు. దీనిని కర్ణాటకకు తరలించేందుకు రామా టాకీస్ వద్దకు చేరుకున్నారు. ద్వారక పోలీసులు వారి బ్యాగులను తనిఖీ చేయగా 10 కిలోల గంజాయి లభించినట్లు సీఐ వెంకటరమణ తెలిపారు.
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించింది. రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై ఇది వర్తిస్తుందని తెలిపింది. సాధారణ ఖాతాదారులకు 4 శాతం నుంచి గరిష్ఠంగా 8.60 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 4.50 శాతం నుంచి 9.10 శాతం మధ్య రాబడిని ఆఫర్ చేస్తోంది. ఈ వడ్డీ రేట్లు 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలవ్యవధులకు వర్తించనుంది. 6 నెలలకు ఒకరోజు కాలవ్యవధిపై డిపాజిట్లకు 7.25 శాతం వడ...
NLR: గ్రామాల అభివృద్ధి చేసి స్వర్ణాంధ్రను సాధిస్తామని ఎంపీడీవో సుబ్రహ్మణ్యం అన్నారు. కొడవలూరు గ్రామ సచివాలయంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర 2047 గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. సర్పంచ్ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి అందరు సహకరించాలని కోరారు.
ELR: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 28న దేవాలయాల్లో నిర్వహించే పూజల్లో పాల్గొనాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో నాయకులు, కార్యకర్తలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని కోరారు.
WG: నరసాపురం మండలం వేములదీవి గ్రామంలో పోతాబత్తుల ఈశ్వర్ రావు అనే వ్యక్తి ఏఓఎస్ డి వ్యాధితో బాధపడుతున్నారు. వైద్యానికి రూ. 5లక్షల వరకు అవసరమని వైద్యులు తెలిపారు. ఆర్ధిక స్థోమత సరిపోకపోవడంతో ఈ విషయం నరసాపురం ఎమ్మెల్యే నాయకర్ దృష్టికి తీసుకు వెళ్లారు. తక్షణమే ఎమ్మెల్యే స్పందించి బుధవారం వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.2,50,000 మంజూరు చేయించారు.
NLR: వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను పెంచలకోన దేవస్థానం నూతన డిప్యూటీ కమిషనర్ పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వెంకటగిరిలోని ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్కను అందజేశారు. పెంచలకోనకు వచ్చే భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిప్యూటీ కమిషనర్ కు సూచించారు.
KMM: కల్లూరు మండలం కోర్లగూడెం గ్రామపంచాయతీ నందు బుధవారం చేపట్టిన స్వచ్ఛత హే సేవ కార్యక్రమంలో ఎంపీడీవో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. నాటిన ప్రతి మొక్క బతకాలని స్థానిక పంచాయతి సెక్రటరీకి సూచించారు. అనంతరం సీజనల్ వ్యాధుల దృష్ట్యా చేపట్టినా పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు.
ఏలూరు: జిల్లా మద్యనిషేధ, అబ్కారీ అధికారిగా ఎ.ఆవులయ్య బుధవారం ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని మద్యనిషేధ, అబ్కారీ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆవులయ్య మాట్లాడుతూ.. జిల్లాలో అక్రమ మద్యం రవాణా, సారా తయారీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
KMM: కొణిజర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రజలు ఈ నెల 2న నిర్వహించే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై జి సూరజ్ బుధవారం తెలిపారు. కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదైనవారు, ఇరుపక్షాల వారు రాజీ కుదుర్చుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
VZM: గుర్ల జంక్షన్లో చీపురుపల్లి సీఐ జీ. శంకర రావు, గుర్ల ఎస్సై పి.నారాయణ రావు ఆద్వర్యంలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా “సంకల్పం” అనే పేరుతో అవగాహన కార్యక్రమం బుధవారం రాత్రి నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యలకు యువత దూరంగా ఉండాలని, మత్తుకు బానిసై తమ జీవతాలను నాశనం చేసుకోవద్దని సీఐ గ్రామస్థులకు అవగాహన చేశారు.
SKLM: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గార స్టేట్ బ్యాంకులో కుదువపెట్టిన బంగారం మాయమైన కేసులో విచారణ చేపట్టి బాధితులకు వారి ఆభరణాలు అప్పగించినా… గతేడాది నవంబరు 30న గార ఎస్బీఐ బ్రాంచ్‌లో తాకట్టులో ఉన్న 62 బ్యాగుల్లో ఉన్న బంగారు ఆభరణాలు మాయమైన ఉదంతంతో ఎస్‌బీఐ ఆర్‌ఎం రాజు పాత్రపై అటు పోలీసులు, ఇటు బాధితులు అనుమానాలు వ్యక్తం చేశారు.
IBSF ప్రపంచ 6-రెడ్ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో భారత వెటరన్ క్యూయిస్టు కమల్ చావ్లా విజేతగా నిలిచాడు. ఫైనల్‌లో కమల్ 6-2 తేడాతో అస్జద్ ఇక్బాల్(పాకిస్తాన్)పై గెలుపొందాడు. 2017లో టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన 45 ఏళ్ల చావ్లా తొలిసారి టైటిల్ అందుకున్నాడు. ఇదే టోర్నీలో మల్కీత్‌సింగ్ విద్యాపిళ్లై, కీర్తన పాండియాన్ కాంస...
NLR: ఉదయగిరి మండల పరిధిలోని అర్హులైన ప్రతి ఒక్కరికి భూములు అందించాలని ఫడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పీవీ రమణయ్య జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ కు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఒకే వ్యక్తికి బినామీ పేర్లతో 400 ఎకరాలు భూమి ఉందని వాటిని రద్దుపరిచి అర్హులైన ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పేద ప్రజలకు భూములు అందించాలని కోరారు.
NLR: మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ అంతిమయాత్ర గురువారం మధ్యాహ్నం 4 గంటలకు ఉంటుందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. అనారోగ్య కారణాలతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలోచికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మాగుంట పార్వతమ్మ మృతి చెందారని అన్నారు. గురువారం మధ్యాహ్నం అంతిమయాత్ర జరగనుందన్నారు.
HYD: రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ బీవీ విజయలక్ష్మి, రాష్ట్ర అధ్యక్షురాలు పి.ప్రేంపావని, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల్‌రాజు డిమాండ్ చేశారు.