• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘విజయనగరం ఉత్సవాల్లో కళా ప్రదర్శనలకు అవకాశం’

VZM: విజయనగరం ఉత్సవాల్లో అక్టోబర్ 13, 14వ తేదీలలో స్థానిక ఆనంద గజపతి కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వెన్యూ ఇంఛార్జ్ ఆర్.డబ్ల్యూ.ఎస్ ఎస్‌ఈ ఉమా శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలచిన వారు తమ వివరాలను మహారాజా సంగీత నృత్య కళాశాల నందు ఉ 10 నుండి సా5 గంటల లోపల అందజేయాలని, చివరి తేది సెప్టెంబర్ 28 అని తెలిపారు.

September 25, 2024 / 04:54 PM IST

జనాభాలో ఎటువంటి మార్పు లేదు: సీఎం హేమంత్

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బంగ్లాదేశీలు, రోహింగ్యాల చొరబాట్లను జార్ఖండ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని బీజేపీ చేసిన ఆరోపణలను ఆ రాష్ట్ర సీఎం ఖండించారు. రాష్ట్ర జనాభాలో ఎటువంటి మార్పు లేదని సీఎం హేమంత్ సోరెన్ స్పష్టం చేశారు. ప్రజల్లో విద్వేషాలకు బీజేపీ బీజం వేస్తోందని సాహిబ్‌గంజ్‌లో నిర్వహించిన సభలో విమర్శలు చేశారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ కొంతమంది జార్ఖండ్ నేతలను కొనుగోలు చేసిందని ...

September 25, 2024 / 04:50 PM IST

‘ప్రభుత్వం ద్వారా జీడిమామిడి పిక్కలు కొనుగోలు చేయాలి’

ASR: రైతులు తగిన సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని కొయ్యూరు ఏవో డీ.ఉమాదేవి సూచించారు. బుధవారం కొమ్మిక, కన్నంపేట రైతు సేవా కేంద్రాల్లో పొలం పిలుస్తోంది నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయా కేంద్రాల పరిధిలోని పంట పొలాలు పరిశీలించారు. సాగుకు సంబంధించి రైతులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ద్వారా జీడి పిక్కలు కొనుగోలు చేయాలని రైతులు కోరారు.

September 25, 2024 / 04:49 PM IST

‘మన ఇల్లు మన గౌరవం కార్యక్రమం’

SKLM: జలుమూరు మండలం ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం “మన ఇల్లు మన గౌరవం” కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

September 25, 2024 / 04:47 PM IST

‘అదనపు తరగతి గదులు నిర్మించాలి’

మేడ్చల్: ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని టీచర్లు లేని స్కూల్స్‌లో వెంటనే ఉపాధ్యాయులను నియమించి అదనపు తరగతి గదులు నిర్మించాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ EV నర్సింహరెడ్డిని తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి వినతపత్రం సమర్పించారు.

September 25, 2024 / 04:45 PM IST

ప్రతి రైతుకు బీమా కల్పిస్తాం: కొండా సురేఖ

TG: ప్రతి రైతుకు బీమా అమలు చేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. అర్హులైన రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇస్తామని భరోసా కల్పించారు. సన్న వడ్లు పండించిన రైతులకు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. జీలుగు విత్తనాలు ప్రతి రైతులకు అందేలా చూస్తామన్నారు. సోలార్ ప్లాంట్‌లకు దేవాలయ భూములు వాడాలని సూచించారు. 

September 25, 2024 / 04:45 PM IST

‘ఘనంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు’

SKLM: ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల బీజేపీ నాయకులు శ్రీనివాసరావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

September 25, 2024 / 04:44 PM IST

“ప్రభుత్వ విధానాలను ఎవరు నిర్ణయిస్తున్నారు..?”

రద్దు చేసిన సాగు చట్టాలను మళ్లీ తీసుకురావాలంటూ తాను చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ క్షమాపణలు చెప్పిన వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ప్రభుత్వ పాలసీలను ఎవరు నిర్ణయిస్తున్నారు? బీజేపీ ఎంపీనా? లేదా ప్రధాని మోదీనా?’ అని ట్వీట్ చేశారు. 700 మందికిపైగా రైతులు.. ముఖ్యంగా పంజాబ్, హరియాణాలకు చెందిన కర్షకులు బలిదానం చేసినా బీజేపీ నేతలు సంతృప్తి చ...

September 25, 2024 / 04:44 PM IST

పంటలు పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు

HYD: ధారూరు మండల పరిధిలోని మైలారం గ్రామపంచాయతీ పరిధిలోని మైలారం ముందల తండా, కొత్త తండాలలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంట, వరి పంటలను వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో కలిసి పరిశీలించారు. రైతులకు భారీ వర్షాలు కురవడంతో భారీగా నష్టం జరిగిందని రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వానికి నివేదిక అందించాలని వ్యవసాయ శాఖ కోరారు.

September 25, 2024 / 04:42 PM IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై లోకేష్ కీలక వ్యాఖ్యలు

AP: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, తిరుమల లడ్డూ ప్రసాదం ఘటనపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ నోవాటెల్‌లో సీఐఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వబోమని స్పష్టంచేశారు. ఈ విషయంలో అనవసరంగా దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. తిరుమల లడ్డూ వివాదంలో సిట్ దర్యాప్తులో అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు.

September 25, 2024 / 04:38 PM IST

కాంగ్రెసోళ్లకు పాలాభిషేకం చేస్తా: మల్లారెడ్డి

TG: మాజీమంత్రి మల్లారెడ్డి ఇవాళ యాదాద్రిలో లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకున్నారు. అనతంరం హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు. “హైడ్రా ప్రజలను రోడ్లపై పడేస్తోంది. అందరిలాగే నాకూ నోటీసులు ఇచ్చారు. దీని వల్ల ప్రజలకు ప్రశాంతత లేకుండా పోయింది. కేసీఆర్ పాలనలో పండించిన పంట కంటే ఎక్కువ పండిస్తే కాంగ్రెస్ నేతలకు పాలాభిషేకం చేస్తా. కాంగ్రెస్ అంటేనే గుంపు రాజకీయాలు.. అవి పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన మ...

September 25, 2024 / 04:24 PM IST

SORRY చెప్పిన మంత్రి నారా లోకేశ్

AP: విశాఖ తాడిచెట్లపాలెం వద్ద లోకేశ్ కాన్వాయ్ వాహనం తన వాహనాన్ని ఢీ కొట్టిందని కళ్యాణ్ భరద్వాజ్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. దీనికి కళ్యాణ్ భరద్వాజ్‌కు మంత్రి నారా లోకేశ్ క్షమాపణ చెప్పారు. దెబ్బతిన్న వాహనానికి మరమ్మతు ఖర్చులు భరిస్తానని లోకేశ్ తెలిపారు. ఈ తరహా ఘటన పునరావృతం కాకుండా చూసుకుంటానని పేర్కొన్నారు.

September 25, 2024 / 04:19 PM IST

రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలి: హరీశ్‌రావు

TG: రైతు భరోసా డబ్బులు వెంటనే విడుదల చేయాలని మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. 10 నెలలుగా చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. సిద్ధిపేట జిల్లాలో రెగ్యులర్ డీఏవో లేరని గుర్తుచేశారు. జీలుగ, జనుము సకాలంలో అందించాలని, యూరియా బఫర్ స్టార్ ఉంచాలని తెలిపారు. రూ.2 లక్షల పైన ఉన్న రుణమాఫీపై క్లారిటీ ఇవ్వాలని కోరారు. ఈజీఎస్ నిధుల విడుదలలో MLAల పాత్ర ఉండాలని చెప్పారు.

September 25, 2024 / 04:17 PM IST

‘గేమ్ ఛేంజర్’ నుంచి అప్డేట్ వచ్చేసింది

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ నుంచి ‘రా మచ్చ మచ్చ’ అంటూ సాగే రెండో పాట ప్రోమోను ఈ నెల 28న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన ‘జరగండి’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

September 25, 2024 / 04:13 PM IST

ఏ జట్టునైనా ఇంగ్లాండ్‌ ఓడించగలదు: బెల్‌

వచ్చే ఏడాది ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ కోసం టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో ICC టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత్‌తో పోరు అంటే ఇంగ్లాండ్ జట్టుకు సవాలేనని ఆ జట్టు మాజీ క్రికెటర్ ఇయాన్ బెల్ అన్నాడు. అయినప్పటికీ బజ్ బాల్‌తో ఏ జట్టునైనా ఓడించగల సత్తా ఇంగ్లాండ్‌కు ఉందని పేర్కొన్నాడు. కచ్చితంగా తమ జట్టే సిరీస్‌ను కైవసం చేసుకుంట...

September 25, 2024 / 04:12 PM IST