రద్దు చేసిన సాగు చట్టాలను మళ్లీ తీసుకురావాలంటూ తాను చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ క్షమాపణలు చెప్పిన వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ప్రభుత్వ పాలసీలను ఎవరు నిర్ణయిస్తున్నారు? బీజేపీ ఎంపీనా? లేదా ప్రధాని మోదీనా?’ అని ట్వీట్ చేశారు. 700 మందికిపైగా రైతులు.. ముఖ్యంగా పంజాబ్, హరియాణాలకు చెందిన కర్షకులు బలిదానం చేసినా బీజేపీ నేతలు సంతృప్తి చెందలేదు” అని విమర్శించారు.