BDK: కొత్తగూడెం సింగరేణి ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న మహిళా నర్సులకు వారానికి మూడు రోజులు మాత్రమే విధులు కేటాయించాలని కోరుతూ.. ఏరియా జీఎం శాలెం రాజుకు ఏఐటీయుసీ కేంద్ర కమిటీ కార్యదర్శి వంగా వెంకట్ శనివారం వినతి పత్రం అందజేశారు. మహిళా నర్సుల శారీరక, మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకోవాలని కోరారు.