ఉత్తర్ప్రదేశ్ ఝాన్సీలోని ఆస్పత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఘటనపై దర్యాప్తునకు ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆరోగ్యశాఖకు చెందిన నలుగురు ఉన్నతాధికారులను నియమించింది. ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తు జరిపి ఏడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంది. కాగా యూపీలోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం సంభవించి 10 మంది శిశువులు మృతి చెందిన విషయం తెలిసిందే.