ఇప్పటి వరకు ఇస్రో ఇతర దేశాలకు చెందిన శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించి చరిత్ర సృష్టించింది. కానీ ఇప్పుడు మొదటి సారిగా ఎలాన్ మస్క్‌కు చెందిన ‘Space X’ సంస్థ ద్యారా ఓ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపాలని నిర్ణయం తీసుకుంది. ఇస్రో ఉపయోగించే ‘మార్క్-3’ రాకెట్ 4 వేల కిలోల బరువున్న శాటిలైట్లను మాత్రమే తిసుకెళ్లగలదు. అయితే ప్రస్తుతం ‘GSAT-N2’ శాటిలైట్ 4700 కిలోలు ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.