చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు రాత్రి గాఢ నిద్ర కోసం ఈ టిప్స్ ఫాలో అవండి. నిద్రపోయే ముందు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే హాయిగా నిద్రపడుతుంది. పడుకోవడానికి గంట ముందు స్మార్ట్ ఫోన్ల వినియోగం తగ్గించాలి. పుస్తకాలు చదవడం, ప్రశాంతమైన సంగీతాన్ని వినడం వల్ల కూడా నిద్రపడుతుంది. హాయిగా నిద్రపోవాలనుకునే వారు వీలైనంత వరకు ఒత్తిడి తగ్గించే విధంగా ధ్యానం వంటివి చేస్తే మంచిదని మానసిక నిపుణులు చెబుతున్నారు.