TG: ఆయిల్ పామ్ సాగును లాభసాటిగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణంలో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో ఉంచాలన్నారు. అలాగే, పురోగతి చూపించని ఆయిల్ కంపెనీలపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. తీరుమార్చుకోని కంపెనీల అనుమతులు రద్దు చేసి, టీజీ ఆయిల్ ఫెడ్‌కు కేటాయిస్తామని చెప్పారు. త్వరలో పామ్ ఆయిల్ గెలల టన్ను ధర రూ.20వేలు దాటే అవకాశం ఉందని తెలిపారు.