TG: సీఎం రేవంత్‌కి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరో సవాల్ విసిరారు. 3 నెలలు మూసీ ప్రాంతంలో ఉండేందుకు తాను సిద్ధమని తెలిపారు. అయితే రేవంత్ చేసిన ఛాలెంజ్‌కు కట్టుబడి ఉన్నారా? అని ప్రశ్నించారు. తన ఛాలెంజ్‌ను స్వీకరిస్తే కుటుంబంతో కలిసి మూసీ ప్రాంతంలోనే కాపురం పెడతానని స్పష్టం చేశారు. గతంలో రేవంత్ BRS, BJP నేతలు మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తే మూసీ ప్రక్షాళన అంశాన్ని విరమించుకుంటానని సవాల్ విసిరారు.