ఢిల్లీలో కాలుష్యానికి బీజేపీ పాలిత రాష్ట్రాలే కారణమని ఆప్ మంత్రి గోపాల్ రాయ్ ఆరోపించారు. BS4 డీజిల్ బస్సులపై నిషేధం ఉన్నప్పటికీ హర్యానా, యూపీ రాష్ట్రాలు వాటిని ఢిల్లీకి పంపుతున్నాయని, దీంతో కాలుష్యం తీవ్రం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు అధికారులు చలాన్లు కూడా జారీ చేశారన్నారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు ముమ్మరంగా చర్యలు తీసుకుంటుంటే పొరుగు రాష్ట్రాలు వాటిని నిర్వీర్యం చేస్తున్నాయన్నారు.