TG: BJP ఎమ్మెల్యే రాజాసింగ్ గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తనను పార్టీ సస్పెండ్ చేసిన తరువాత BJLP పదవిని ఏలేటి మహేశ్వర్ రెడ్డికి అప్పగించింది. ఇక అప్పటి నుంచి కార్యక్రమాలకు మాత్రమే కాకుండా పార్టీ ఆఫీసు గడప కూడా తొక్కకడం లేదు. దీంతో రాజాసింగ్ పార్టీని పక్కకు పెట్టారా లేక పార్టీనే అతన్ని లైట్ తీసుకుందా అనే చర్చలు జరుగుతున్నాయి.