TG: కొత్త స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ అధికారును ఆదేశించారు. మహిళా సంఘాలలో సభ్యత్వం లేని మహిళలను గుర్తించి ఎస్హెచ్.జి గ్రూపులు ఏర్పాటు చేయాలన్నారు. సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధించడంలో మహిళల పాత్ర కీలకమన్నారు.