AP: తిరుపతి జిల్లా, చిల్లకూరు మండలం, అల్లిపురం గిరిజన కాలనీలో విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఉతికేందుకు కాలువకు వెళ్లిన నాగేంద్రమ్మ(11), చింతాలయ్య (10) అనే చిన్నారులు కాలువలో గల్లంతయ్యారు. స్థానికులు వారిని కాపాడేందుకు ప్రయత్నించేలోపే ఇద్దరు ప్రాణాలు విడిచారు. దీంతో చిన్నారుల కుటుంబ సభ్యలు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.