చైనాలో దారుణం చోటు చేసుకుంది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే కోపంతో ఓ యువకుడు (21) రెచ్చిపోయాడు. కాలేజీ క్యాంపస్లో కనిపించిన వారిపై విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఈ ఘటన నిన్న సాయంత్రం వుషీ నగరంలోని ఇక్సింగ్ కౌంటీలో ఉన్న వుషీ వొకేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీ కాలేజీలో జరిగింది. ఈ ఘటనలో మొత్తం 17 మంది తీవ్రంగా గాయపడగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.