వందే భారత్ రైళ్లలో లభించే సౌకర్యాలపై ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ప్రయాణికులకు అందించే భోజన నాణ్యతపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా తిరునల్వెలి నుంచి చెన్నైకి వెళ్లే సమయంలో ఓ ప్రయాణికుడికి వడ్డించిన భోజనంలో కీటకాలు వచ్చాయి. దీనిపై ఫిర్యాదు చేయడంతో రైల్వే అధికారులు సర్వీస్ ప్రొవైడర్‌కు రూ.50వేలు జరిమానా విధించారు. ఆహార నాణ్యతకు రైల్వే శాఖ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.