ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా నిన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఒక్క సారిగా ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరారు. ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు గోవిందా ఆరోగ్యంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.