TG: మాజీమంత్రి కేటీఆర్ అరెస్ట్ గురించి గవర్నర్‌ను అడిగినట్లు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. ‘తప్పు చేశాడని కేటీఆర్‌కు తెలుసు కాబట్టే జైలుకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. వాస్తవాలు బయటికి వచ్చాక ఎవరికి ఏ శిక్షపడాలో అది పడి తీరుతుంది. వరంగల్‌ను రాష్ట్రానికి రెండో రాజాధానిగా చేస్తామని ఎక్కడా అనలేదు. హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేస్తామనే మాటకు కట్టుబడి ఉన్నాం’ అని వెల్లడించారు.