దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని వారాలుగా వాయు నాణ్యత క్షీణిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఢిల్లీలో వాయునాణ్యత మరింత క్షీణించింది. శుక్రవారం 396గా ఉన్న ఏక్యూఐ.. శనివారానికి 417కు చేరింది. శుక్రవారం నుంచి జీఆర్ఏపీ స్టేజ్-3 ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఆంక్షలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. కాగా, తొలిరోజు రూ.5.85 కోట్లు ఫైన్లు వసూల్ చేశారు.