AP: వైసీపీ నేత వర్రా రవీంద్రారెడ్డి భార్య కళ్యాణి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నా భర్తను ఈ నెల 11న అదుపులోకి తీసుకున్నారన్నది అవాస్తవం. 8న కర్నూలు టోల్‌ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారు.. 12న మెజిస్రేట్ ముందు హాజరుపరిచారు. ఆ మూడు రోజుల పాటు నా భర్తను చిత్రహింసలకు గురిచేసి, తప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నారు. నా భర్తకు జరిగిన అన్యాయాన్ని మీడియా ద్వారా అందరికి తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు.