ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం సంభవించి 10 మంది శిశువులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్యశాఖ దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. వైద్యవిద్య డీజీ నేతృత్వంలోని ఈ కమిటీ ఏడు రోజుల్లో సమగ్ర నివేదికను అందజేస్తుందని వెల్లడించింది.