AP: ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ గోదావరిపై నిర్మించిన ఎత్తిపోతల ప్రాజెక్టులోని 23 పంపుల ద్వారా అధికారులు నీటిని విడుదల చేశారు. 8,142 క్యూసెక్కుల నీటిని కుడి కాలువ ద్వారా విడుదల చేసినట్లు డీఈ పెద్దరాజు తెలిపారు. గోదావరిలో నీటిమట్టం 14.23 మీటర్లు ఉండటంతో కుడికాలువ ద్వారా నీటి విడుదల చేసినట్లు పేర్కొన్నారు.