VZM: బొబ్బిలి మున్సిపల్ కార్యాలయాన్ని విశాఖపట్నం ప్రాంతీయ పురపాలక సంచాలకులు వి.రవీంద్ర శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ రామలక్ష్మి, సిబ్బందితో సమీక్ష జరిపారు. పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య, ఇంటింటా చెత్త సేకరణ, తదితర కార్యక్రమాలపై ఆరా తీశారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణకు తీసుకుంటున్న ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు.