AP: ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ధర్నాలు వాయిదా వేసింది. మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి చొరవతో ధర్నాలు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. సమస్యల పరిష్కారానికి ఈ నెల 19, 20న ధర్నాలు తలపెట్టిన విషయం తెలిసిందే. సమస్యల పరిష్కారానికి మంత్రి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈయూ రాష్ట్ర అధ్యక్షుడితో ఆయన ఫోన్లో మాట్లాడారు. మంత్రి హామీతో నిరసన కార్యక్రమాలు వాయిదా వేసినట్లు ఈయూ పేర్కొంది.