SKLM: బూర్జ మండలం లచ్చయ్యపేట గ్రామంలో బూర్జ ఎస్సై ప్రవల్లిక శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యంగా యువత మొబైల్ వాడకాన్ని తగ్గించి చదువుపై దృష్టి సారించాలని, నిషేధిత మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దని సూచించారు. మైనర్లు వాహనాలు నడపడం చాటరీత్యా నేరమన్నారు. మైనర్లు మోటార్ వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైతే వాహన యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.