AP: అసెంబ్లీ సాక్షిగా ఇన్నాళ్లు TDP, జనసేన చేసిన తప్పుడు ప్రచారం బట్టబయలైందని మాజీమంత్రి రోజా పేర్కొన్నారు. ‘వాలంటీర్ల ద్వారా మహిళల అక్రమ రవాణా జరిగిందని, 30 వేలమంది మహిళలు మిస్ అయ్యారని చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధం. ఐదేళ్ళలో 34 కేసులు మహిళల అక్రమ రవాణాకు సంబంధించి నమోదయ్యాయని హోంమంత్రి అనిత అసెంబ్లీలో లిఖిత పూర్వకంగా తెలిపారు. ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి పవన్.. అధికారం కోసం ఎంతటి అబద్ధమైన చెప్తారా?’ అని ప్రశ్నించారు.