వచ్చే ఏడాది ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ కోసం టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో ICC టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత్‌తో పోరు అంటే ఇంగ్లాండ్ జట్టుకు సవాలేనని ఆ జట్టు మాజీ క్రికెటర్ ఇయాన్ బెల్ అన్నాడు. అయినప్పటికీ బజ్ బాల్‌తో ఏ జట్టునైనా ఓడించగల సత్తా ఇంగ్లాండ్‌కు ఉందని పేర్కొన్నాడు. కచ్చితంగా తమ జట్టే సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు.