టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై శిఖర్ స్పందించాడు. జాతీయ జట్టులో స్థానం కోసం దేశవాళీ క్రికెట్ ఆడాలనే ఉత్తేజం తనలో లేకపోవడం వల్లే రిటైరయ్యానని తెలిపాడు. “నా కెరీర్ చివరి రెండేళ్లలో పెద్దగా అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. IPLలో మాత్రమే ఆడా. ఇప్పటివరకు చాలా క్రికెట్ ఆడానని అనిపించింది. నేను సాధించిన దాని పట్ల సంతృప్తిగా ఉన్నా” అని అన్నాడు.