అక్టోబర్ 3 నుంచి యూఏఈ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో హర్మన్ ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత మహిళా జట్టు దుబాయ్ చేరుకుంది. అయితే ఎయిర్పోర్టులో హీరో దగ్గబాటి రానా అనుకోకుండా క్రికెటర్లను కలిశాడు. ఈ క్రమంలో వారికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. కప్ గెలిచి దేశానికి తీసుకురావాలని.. కచ్చితంగా సాధిస్తారని వారితో సంభాషించాడు. అనంతరం వారితో కలిసి ఫొటోలు దిగాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరలవుతున్నాయి.