AP: ఎర్రమట్టి దిబ్బల వ్యవహారంపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. మట్టి దిబ్బలను తవ్వుతూ విధ్వంసం చేస్తున్నారని.. అవి CRZ, జియో హెరిటేజ్ పరిధిలోకి వస్తాయని చెప్పారు. ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు పొందకుండా పనులు చేస్తున్నారని తెలిపారు. దీంతో ఎర్రమట్టి దిబ్బల వద్ద పనులు నిలిపివేయాలని కోర్టు చెప్పింది. ఈ మేరకు GVMC, ఇతర సంబంధిత శాఖలకు నోటీసులిచ్చింది.