NLR: గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఔట్సోర్సింగ్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం నెల్లూరు ఐటీడీఏ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. ఆ సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమణ, తార మాట్లాడుతూ.. చాలీచాలని జీతాలతో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నామని అన్నారు. పర్మినెంట్ చేసే వరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు.