యూపీ మంత్రి నంద్ గోపాల్ గుప్తా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. మంత్రి కుమారుడిని అంటూ అకౌంటెంట్ రితేశ్ శ్రీవాస్తవకు సైబర్ నేరగాళ్లు కాల్ చేశారు. ‘నేను బిజినెస్ మీటింగ్లో ఉన్నాను. అర్జెంటుగా డబ్బులు కావాలి. త్వరగా పంపండి’ అని చెప్పాడు. దీంతో అకౌంటెంట్ మూడు ఖాతాల్లో రూ.2.8 కోట్లు పంపాడు. అనంతరం ఖాతాలను చెక్ చేసిన అకౌంటెంట్ అవి మంత్రి కొడుకువి కాదని తెలిసి.. సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.