TG: ప్రధాని మోదీ, అదానీ ఇద్దరూ ముంబై నగరాన్ని దోచుకోవడానికి వచ్చారని CM రేవంత్ ఆరోపించారు. ముంబైలో భూములు కాజేయడానికే అదానీ BJPతో చేతులు కలిపారన్నారు. CM చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తూ.. తెలంగాణలో అదానీ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చి స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్ల విరాళం ఇచ్చినపుడు ఎందుకు తీసుకున్నారని నిలదీస్తున్నారు. ఒకవైపు ఆయనతో దోస్తీ చేస్తూనే.. మరోవైపు వ్యతిరేక వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.