TG: నిధులు తేలేని బీజేపీ నేతలు మూసీ వద్ద నిద్రకు వస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ సూచనతోనే కిషన్‌రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని అన్నారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు మొద్దు నిద్ర వదలండి అంటూ విమర్శలు చేశారు. మూసీ వద్ద నిద్రలేచిన తర్వాత అక్కడి ప్రజలకు వాస్తవాలు చెప్పండి అని పేర్కొన్నారు.