SDPT: రాష్ట్రంలో ఓటర్ నమోదు కార్యక్రమం కట్టుదిట్టంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి,స్పెషల్ సమ్మరీ రివిజన్, ఈ.ఆర్.ఓ నెట్ 2.0పై జిల్లాల కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మనూచౌదరి,అధికారులు పాల్గొన్నారు.
కోల్‌కతాలో 150 ఏళ్లుగా కొనసాగుతున్న ట్రామ్ సేవలు త్వరలో కనుమరుగు కానున్నాయి. మైదాన్ నుంచి ఎస్ప్లానేడ్ వరకు వారసత్వంగా కొనసాగుతున్న ట్రామ్ సర్వీసు మినహా మిగిలిన సర్వీసులను త్వరలో నిలిపివేయాలని పశ్చిమ బెంగాల్ సర్కారు నిర్ణయించింది. దీంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోల్‌కతా వీధుల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ట్రామ్ ప్రయాణికులు నిశ్చయించుకున్నట్లు సమా...
WGL: డివిజన్‌లోని 11కేవీ ఫీడర్ మెయింటేనెన్స్‌లో భాగంగా విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నామని వరంగల్ డివిజన్ డీఈ శంకేసి మల్లిఖార్జున్ తెలిపారు. ఖిలావరంగల్, శివనగర్, చింతల్, పుప్పాలగుట్ట, ఆదర్శనగర్, మధ్యకోట, తూర్పుకోట, పడమర కోట, శివనగర్, స్తంభంపల్లి ప్రాంతాల్లో బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పవర్ కట్ అమలులో ఉంటుందన్నారు.
MLG: వెంకటాపురంమండల కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతి గృహన్ని మంగళవారం రాత్రి తహసీల్దార్ లక్ష్మి రాజయ్య సందర్శించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పల్లె నిద్ర కార్యక్రమంలో బాగంగా ఆయన సందర్శించారు. ఈ సంద్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు వండిన భోజనాన్ని ఆయన పరిశీలించారు. హాస్టల్ పరిసరాలను పరిశీలించారు.
SDPT: దూల్మిట్ట విద్యుత్తు ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా బుధవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని మండల సహాయ ఇంజినీర్ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
KRNL: మండల పరిధిలోని ఉల్చాలా గ్రామంలో బుధవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ గ్రామసభ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరుకానున్నారు. కూటమి నేతలు, క్లస్టర్, బూత్, యూనిట్ ఇన్‌ఛార్జులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఓ ప్రకటనలో పిలుపునిచ్చింది.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ మూర్తులకు బుధవారం ఉదయం నిత్య నిజాభిషేకం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి సుప్రభాత సేవ, అనంతరం పాలు, పెరుగు, తెనే, పంచదార పంచామృతాలతో నిజాభిషేకం వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారి క్షేత్ర వైభవాన్ని భక్తులకు వివరించారు. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
ప్రకాశం: చీరాల రూరల్ సీఐగా శేషగిరిరావు మంగళవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. చీరాల వన్ టౌన్ సీఐగా ఉంటూ నెలరోజుల క్రితమే బదిలీ అయిన శేషగిరిరావు మళ్లీ చీరాలకు రూరల్ సీఐగా వచ్చారు. ఈ మేరకు ఆయనకు స్టేషన్ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
పెద్దపల్లి: స్వచ్ఛతా హీ సేవా-2024లో భాగంగా రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గోదావరి పుష్కర ఘాట్ వద్ద పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ క్యాడెట్లు స్వచ్చందంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జై కిషన్, నగరపాలక సంస్థ సెక్రెటరీ రాజు, హెల్త్ అసిస్టెంట్ పాల్గొన్నారు.
TG: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నకిలీ మహిళా ఫుడ్ ఇన్స్‌పెక్టర్లు హల్ చల్ చేశారు. ప్రముఖ హోటళ్లలో చెకింగ్ పేరుతో యజమానులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. సిటీలో పెరిగిన ఫుడ్ తనిఖీల నేపథ్యంలో హోటల్ యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. దీనిని క్యాష్ చేసుకున్న ఇద్దరు నకిలీ మహిళా ఫుడ్ ఇన్స్‌పెక్టర్లు అందిన కాడికి దోచుకుంటున్నారు. అనుమానంతో అధికారులకు ఫిర్యాదుచేయడంతో ఇద్దరు కేడీలను పోలీసులు ...
KRNL: నందవరం (మం) ఇబ్రహీంపురం, నదికైరవాడి గ్రామాల్లో బుధవారం ఉదయం 11 గంటలకు జరగనున్న ‘ఇది మంచి ప్రభుత్వం’ గ్రామసభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా MLA డా.బీవీ.జయ నాగేశ్వర్‌రెడ్డి హాజరుకానున్నారు. కూటమి నేతలు, క్లస్టర్, బూత్, యూనిట్ ఇన్‌ఛార్జ్‌లు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని MLA బీవీ క్యాంపు కార్యాలయం ఓ ప్రకటనలో పిలుపునిచ్చింది.
బాపట్ల: సంతమాగులూరు మండలంలోని సజ్జాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కనకమ్మ అనారోగ్య కారణంగా మంగళవారం రాత్రి మృతిచెందారు. కనకమ్మ మృతిచెందిన విషయం తెలుసుకున్న పలురు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కనకమ్మ సజ్జాపురం సర్పంచ్‌గా 2001- 2006, 2013- 2018 రెండు దఫాల్లో సర్పంచ్‌గా సేవలందించారు.
MDK: శ్రీ ఏడుపాయల దేవాలయంలో బుధవారం వన దుర్గమ్మకు ప్రత్యేక అలంకరణతో పూజలు చేశారు. అనంతరం మంగళహారతి నీరాజనం చేశారు. జిల్లాలోని నలుమూలల నుండి భక్తులు తెల్లవారి నుండి ఆలయానికి తరలి వస్తున్నారు. స్థానిక నది పాయలో పుణ్యస్నానం చేసి వన దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. అర్చకులు పార్థివ శర్మ భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేస్తున్నారు.
ప్రకాశం: మార్కాపురం పట్టణానికి చెందిన MBBS విద్యార్థి హరిదీప్ మృతదేహం కోసం గత 3రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మారేడుమల్లి జలపాతంలో స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు వెళ్లిన హరిదీప్ నీటిలో గల్లంతయ్యాడు. ఆదివారం హరిదీప్ గల్లంతు కాగా గత మూడు రోజుల నుంచి మృతదేహం కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కానీ విద్యార్థి ఆచూకి మాత్రం లభ్యం కాలేదని అధికారులు తెలిపారు.
బిగ్‌బాస్ OTT కంటెస్టెంట్ ఇచ్చిన ఫిర్యాదుతో ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని, హత్యాచారానికి పాల్పడ్డారని యువతి ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు హర్ష సాయిపై 376(2), 376N, 354 సెక్షన్ల కింద రేప్ కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ఆమెను నిన్న రాత్రి ఆస్పత్రికి తీసుకొచ్చి పరీక్షలు జరిపించారు. అనంతరం ఆమెను సఖి ...