• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జిల్లా వ్యాప్తంగా ’30 పోలీస్ యాక్ట్’ అమలు

MBNR: శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లాలో మార్చి 1 నుంచి 30 వరకు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, బహిరంగ సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

March 1, 2026 / 01:23 PM IST

ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ ఎన్నిక

NRPT: మరికల్ మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా శివప్రసాద్, చెన్నయ్య, అధ్యక్షులుగా కృష్ణయ్య, రాములు, ప్రధాన కార్యదర్శిగా ముకుంద రెడ్డి, రాజేష్, అయ్యప్ప, కోశాధికారిగా హరిప్రసాద్‌తో పాటు సంయుక్త కార్యదర్శి సలహాదారులుగా పలువురిని ఎన్నుకున్నారు.

March 1, 2026 / 01:23 PM IST

రోడ్డుపై చెత్త కుప్పలు.. వాహనదారుల అవస్థలు

GDWL: గద్వాల పట్టణంలోని ఆర్టీసీ పెట్రోల్ పంప్ పక్కన రహదారి చెత్తాచెదారంతో అధ్వానంగా తయారైంది. ఈ మార్గంలో ప్రయాణించే వారు తీవ్రమైన దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొందరు వ్యక్తులు బాధ్యత లేకుండా రోడ్డుపైనే చెత్త పారేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి, ఆ వ్యర్థాలను తొలగించాలని డిమాండ్ చేశారు.

March 1, 2026 / 01:22 PM IST

మదనపల్లెలో మెగా జాబ్ మేళా

అన్నమయ్య: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో మార్చి 6న మదనపల్లె గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి దాసరి నాగార్జున తెలిపారు. AU Small Finance Bank, Apollo Pharmacy తదితర ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయి. వివరాలకు 6301612761 నంబర్‌ను సంప్రదించవచ్చు.

March 1, 2026 / 01:22 PM IST

పనుల్లో నాణ్యతపై స్పీకర్ ఆగ్రహం

AKP: నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి మరమ్మతులు, రంగులు వేసే పనుల కోసం నాబార్డ్ కింద సుమారు రూ. 40 లక్షల నిధులను స్పీకర్ మంజూరు చేయించారు. పనులను కౌన్సిలర్ చింతకాయల పద్మావతితో కలిసి ఆయన పర్యవేక్షించారు. పనులు నాణ్యతపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

March 1, 2026 / 01:22 PM IST

పశు మాంసం విక్రయిస్తున్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు

VZM: ఎస్ కోట మండలం గోపాలపల్లి ఎస్సీ కాలనీ వద్ద పశు మాంసాన్ని విక్రయిస్తున్న షేక్ బాషా, సుల్తాన్‌ను ఆదివారం ఎస్.కోట పోలీసులు అరెస్టు చేశారు. గొర్రెలు పెంపకం పేరుతో షెడ్డు వేసుకొని, పశువులను వధించి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు దాడులు నిర్వహించి, మాంసాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

March 1, 2026 / 01:19 PM IST

‘అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి’

GNTR: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని అసోసియేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. కొత్తపేటలో ఆదివారం మాట్లాడుతూ..యాజమాన్య కుట్రలను ఆయన తప్పుబట్టారు. బాధితులకు తక్షణమే చెల్లింపులు జరపాలని డిమాండ్ చేస్తూ, మార్చి 2 నుంచి విజయవాడ ధర్నా చౌక్‌లో చేపట్టే రిలే దీక్షలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

March 1, 2026 / 01:19 PM IST

కాంగ్రెస్ గెలుపును తట్టుకోలేక… విషం చిమ్ముతున్న గత పాలకులు

BDK: భద్రాచలం నియోజకవర్గం లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల సన్మాన సభ ఆదివారం ఘనంగా నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలైనా, పంచాయతీ ఎన్నికలు అయిన, మున్సిపల్ ఎన్నికలు అయిన వార్ వన్ సైడ్ గానే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని తెలిపారు. ఇది జీర్ణించుకోలేని గత పాలకులు విషాన్ని చిమ్ముతున్నారన్నారు.

March 1, 2026 / 01:19 PM IST

సీతాఫల్ మండీలో మహనీయుల విగ్రహాల ఏర్పాటు

HYD: బీఆర్.అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు నిరంతరం అనుసరించాలని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. వారి జ్ఞాపకార్థం వారి సేవలను స్మరించుకుంటూ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం క్షేత్రస్థాయిలో పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. మహనీయుల విగ్రహాల ఏర్పాటుతో అందమైన కూడలిగా సీతాఫల్ మండీ రూపుదిద్దుకోనుందని తెలిపారు.

March 1, 2026 / 01:19 PM IST

రాజీనామా వెనక్కి తీసుకున్న గోతులదొడ్డి సర్పంచ్

KRNL: కౌతాళం గోతులదొడ్డి గ్రామ సర్పంచ్ లక్కే హనుమంతమ్మ-భర్త లక్కే గోవిందు, అధిష్టానం చర్చల అనంతరం తమ రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పాలన మండలి ఛైర్మన్ నియామకంలో వల్లూరి నాగేశ్వర రావు మద్దతు ప్రకారం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయమే తుది నిర్ణయం అని వారు వెల్లడించారు.

March 1, 2026 / 01:18 PM IST

ఆర్టీసీ కాంప్లెక్స్ సీసీ రోడ్డు పనుల పరిశీలన

మన్యం: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పరిశీలించారు. ఎన్నో ఏళ్లుగా రహదారి అధ్వానంగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి ఈ పనులు చేపట్టామని ఆమె తెలిపారు.

March 1, 2026 / 01:18 PM IST

ఈనెల 3న సత్యదేవుని ఆలయం మూసివేత

KKD: అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం ఈనెల 3వ తేదీన చంద్రగ్రహణం కారణంగా ఉదయం 10 గంటలకు మూసివేయనున్నట్లు ఈవో వేండ్ర త్రినాధరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేసారు. మరుసటి రోజు 4వ తేదీ వేకువజాము నుంచి సర్వదర్శణములు, ఇతర అన్ని వైధిక కార్యక్రమాలు, నిత్య ఆర్జిత సేవలు యధావిధిగా జరుగుతాయన్నారు. భక్తులు గమనించాలని సూచించారు.

March 1, 2026 / 01:17 PM IST

రిక్రియేషన్ క్లబ్ గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే

CTR: పలమనేరు రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన 11 వాణిజ్య సముదాయ గదులను శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లబ్ నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం తెలియజేశారు. అనంతరం మరమ్మతుల చేపట్టబడిన రిక్రియేషన్ క్లబ్‌ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన కంటి వైద్య శిభిరంలో ఆయన పాల్గొన్నారు.

March 1, 2026 / 01:15 PM IST

విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఇందిరమ్మ

NDL: కొలిమిగుండ్ల మండలం కోరుమాను పల్లె గ్రామంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. నూతనంగా పట్టాభి రామ సీత లక్ష్మణుల విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

March 1, 2026 / 01:15 PM IST

ఇఫ్కోలో భారీ పరిశ్రమకు ఎంపీ శంకుస్థాపన

NLR: కొడవలూరు (M) రాచర్లపాడు ఇఫ్కో కిసాన్ సెజ్లో రూ.260 కోట్లతో ఏర్పాటు చేయనున్న గాయత్రి రెన్యువల్ ఎనర్జీ ఈథనాల్ ప్లాంట్కు ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఇఫ్కో కిసాన్ సెజ్లో ఇది ఆరంభం మాత్రమేనని రానున్న రోజుల్లో అనేక కంపెనీలు వస్తాయన్నారు.

March 1, 2026 / 01:10 PM IST