• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలి’

ASF: ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని ITDA ప్రాజెక్టు అధికారి యువరాజ్ మార్మాట్ ఉపాధ్యా యులను ఆదేశించారు. ఆసిఫాబాద్ బాలికల ఆశ్రమ పాఠశాల, సిర్పూర్ ఈఎంఆర్ఎస్, కాగజ్ నగర్ బాలుర పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించాలని, విద్యార్థులకు మెరుగైన భోజనం, వైద్యం అందించాలని సూచించారు.

February 25, 2026 / 07:15 AM IST

రోడ్డు ప్రమాదాల నివారణకు ఫ్లెక్సీ ఏర్పాటు

కృష్ణా: పామర్రు మండలం బలిపురం గ్రామం NH–65 వద్ద రోడ్డు ప్రమాదాల నివారణ దృష్ట్యా, రోడ్డు భద్రత అవగాహన ఫ్లెక్సీను పోలీసులు మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ శుభకర్ మాట్లాడుతూ.. అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలను నడిపితే ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. జాతీయ రహదారిపై వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు.

February 25, 2026 / 07:15 AM IST

‘రైతుల కోసం నాణ్యమైన విద్యుత్ సరఫరా’

MNCL: పంటలు పండిస్తున్న రైతుల కోసం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని TGNPDCL మంచిర్యాల SE రాజన్న వెల్లడించారు. రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా TGNPDCL పని చేస్తుందన్నారు. మంచిర్యాల పరిధిలో డిసెంబర్ నెల నుంచి ఇప్పటి వరకు 429 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

February 25, 2026 / 07:14 AM IST

ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు: ఎస్పీ

SRD: జిల్లాలో ఇంటర్ పరీక్షల సందర్భంగా కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని ఆదేశించారు. చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరూ సెల్ఫోన్లను అనుమతించవద్దని సూచించారు. ప్రతి కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

February 25, 2026 / 07:13 AM IST

“మత్తు వదలండి – మైదానానికి రండి: MLA నాగరాజు

WGL: వర్ధన్నపేట పట్టణంలోని అల్ఫోర్స్ పాఠశాల వార్షికోత్సవం కార్యక్రమం మంగళవారం సాయంత్రం పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా MLA KR నాగరాజు హాజరై, మాట్లాడారు. “మత్తు వదలండి – మైదానానికి రండి.. మత్తు వదలండి – చదువుతో సత్తా చాటండి” అనే నినాదం రేపటి తరానికి ప్రాణవాయువు కావాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

February 25, 2026 / 07:11 AM IST

మార్చి 5న వికసిత్ భారత్ యువ పార్లమెంట్

SKLM: డా బి.ఆర్. అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో NSS ఆధ్వర్యంలో వచ్చే నెల 5న వికసిత్ భారత్ యువపార్లమెంట్-2026 పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు వీసీ రజని తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ అడ్డయ్య, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ అనురాధ , మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట్ ఉజ్వల్ ఉన్నారు.

February 25, 2026 / 07:10 AM IST

జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

NZB: తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ సంఘం ఆదేశాల మేరకు జిల్లా సైక్లింగ్ సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా అడ్వకేట్ శరత్ చంద్ర బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఎన్నికల్లో కృపాకర్ రెడ్డి జిల్లా సైక్లింగ్ సంఘం అధ్యక్షుడిగా, భూలోక విజయకాంత్ రావు ప్రధాన కార్యదర్శిగా, సురేందర్ కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

February 25, 2026 / 07:10 AM IST

నేడు పామూరులో పవర్ కట్

ప్రకాశం: పామూరు పట్టణంలో కొత్త లైన్ పనులు జరుగుతున్న దృష్ట్యా ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ రసూల్ తెలిపారు. పట్టణంలోని విరువూరు రోడ్డు, ఎర్ర చేలు, కరెంటు ఆఫీసు కాలనీ, పాత స్టేట్ బ్యాంకు రోడ్డు ప్రాంతాలలో కరెంట్ నిలిపివేయనున్నారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

February 25, 2026 / 07:09 AM IST

నేడు పాలకొల్లు ఛాంబర్స్‌లో క్యాంపస్ ఇంటర్వ్యూలు

W.G: పాలకొల్లులోని ఛాంబర్స్ కళాశాలలో ఈనెల 25న జీల్ ఇండియా కంపెనీ ప్రతినిధులు ఉద్యోగ ఎంపికలు నిర్వహించనున్నట్లు కళాశాల ఛైర్మన్ నరసింహారావు తెలిపారు. ఏదైనా డిగ్రీ అంతకంటే ఎక్కువ చదివిన అభ్యర్థులు అర్హులని, ఎంపికైన వారికి నెలకు రూ.18 నుంచి రూ.20 వేల వేతనం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు వివరాలకు 9912046234, 9849712739లను సంప్రదించాలన్నారు.

February 25, 2026 / 07:08 AM IST

ఉచిత కంప్యూటర్ శిక్షణ ప్రారంభం

ASR: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్కిల్ హబ్‌లో ఉచిత కంప్యూటర్ శిక్షణ ప్రారంభించనున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ ప్రసన్న కుమార్ తెలిపారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లమా పూర్తి చేసిన యువతకు ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయని, ప్రతి కోర్సుకు 30 సీట్లు కేటాయించామని, అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు.

February 25, 2026 / 07:07 AM IST

ఈనెల 27 నుంచి వెంకన్న వార్షిక కళ్యాణ మహోత్సవాలు

AKP: అనకాపల్లి దేవుని గుమ్మంలో వేంచేసియున్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఈనెల 27వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ బి. శ్రీనివాసరావు, ఈవో చంద్రతేజ తెలిపారు. 27 ఉదయం ధ్వజారోహణ, రాత్రి కళ్యాణ మహోత్సవం, 28న అన్న సమారాధన జరుగుతుందన్నారు. మార్చి1న అర్ధ ఏకాహం, 2న గరుడ వాహనంపై పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు ఉంటుందన్నారు.

February 25, 2026 / 07:07 AM IST

జిల్లాలో తాగునీటి కొరత లేకుండా చూడాలి: కలెక్టర్

NDL: నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ఎక్కడా తాగునీటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. ఆళ్లగడ్డ, చాగలమర్రి, సంజామల, ఆత్మకూరు మండలాల్లో చేతిపంపుల మరమ్మతుల కోసం పంపిన ప్రతిపాదనలను త్వరితగతిన ఆమోదించి పనులు పూర్తి చేయాలన్నారు. వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.

February 25, 2026 / 07:06 AM IST

ఈనెల 28న సైన్స్ టాయ్ మేకింగ్ వర్క్‌షాప్

TPT: ఫిబ్రవరి 28న తిరుపతిలో జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా సైన్స్ టాయ్ మేకింగ్ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ప్రవేశం ఉచితం, కానీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని అధికారులు తెలిపారు. నమోదు కోసం https://linktr.ee/rsctpt లింక్‌ను సందర్శించాలన్నారు.

February 25, 2026 / 07:05 AM IST

దేవాదుల పథకానికి రూ.1,332 కోట్ల విద్యుత్ బకాయిలు

MLG: దేవాదుల ఎత్తిపోతల పథకంకు సంబంధించిన విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.1,332 కోట్లకు చేరాయి. వేసవి ప్రారంభంతో గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసేందుకు మోటార్లు నిరంతరం నడవాల్సి ఉండటంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. రోజుకు 20మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుండగా, రోజుకు దాదాపు రూ.1కోటి, నెలకు రూ.30 కోట్ల వరకు ఖర్చవుతున్నట్లు అంచనా.

February 25, 2026 / 07:04 AM IST

ఆసుపత్రులకు నోటీసులు జారీ: కలెక్టర్

KMR: కామారెడ్డి జిల్లాలో అనుమతి లేకుండా ఎటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్లు నిర్వహించకూడదని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన DRA కమిటీ సమావేశం జరిగింది. DM&HO రవీందర్ గౌడ్ సమావేశంలో నివేదిక సమర్పించారు. సరైన పత్రాలు సమర్పించని 11 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

February 25, 2026 / 07:04 AM IST