TG: కోకాపేట్‌లోని శారదాపీఠాన్ని మంత్రి శ్రీధర్‌బాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రెండు ఎకరాల భూమి శారదాపీఠానికే ఉంటుంది. భూమిని స్వాధీనం చేసుకుంటామనేది అవాస్తవం. నిర్మాణాలు లేవని అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఆ అధికారులపై చర్యలు తీసుకుంటాం. మధుపార్క్ అపార్ట్‌మెంట్లను కూలుస్తామనేది అవాస్తవం. ప్రభుత్వం బలవంతపు చర్యలకు దిగదు’ అని తెలిపారు.
MDK: తూప్రాన్ పట్టణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ విగ్రహాల వద్ద వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన మాదిగ అమరవీరులకు నివాళులర్పించారు. MRPS మెదక్ జిల్లా అధ్యక్షులు చెట్లపల్లి యాదగిరి మాదిగ ముఖ్య అతిథిగా హాజరు కాగా, నాయకులు సర్గల పరశురాములు, కాలకంటి సత్యం, సర్గల నరసింహులు, నాగులు, ఎర్ర యాదగిరి, గజ్జల యాదగిరి, ఎర్రోళ్ల స్వామి పాల్గొన్నారు.
NLG: రేషన్ సరుకులు మీ హక్కు, డీలర్ చేసే సాయం కాదు. తూకంలో తేడా ఉన్నా, డీలర్ దురుసుగా ప్రవర్తించినా వెంటనే ఫుడ్ అండ్ సివిల్ సప్లై శాఖ టోల్ ఫ్రీ నంబర్: 1967కు ఫిర్యాదు చేయవచ్చు. ఈ విషయంలో గ్రామీణ ప్రజానీకం అవగాహన కలిగి ఉండాలి. తెలంగాణ పౌరసరఫరాల శాఖ పోర్టల్ ద్వారా, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేస్తే అక్రమాలకు పాల్పడే డీలర్‌పై చర్యలు తీసుకుంటారు.
కోనసీమ: అమలాపురంలో కిమ్స్ ప్రాంగణంలో చైతన్య రాజు ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహా సభల్లో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆదివారం విచ్చేశారు. వారిని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్, మాజీ డీఎస్పీ రమావర్మ, మాజీ మున్సిపల్ ఛైర్మన్ నల్లా విష్ణు మూర్తి మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.
VZM: చీపురుపల్లి నూతన రెవెన్యూ డివిజనల్ అధికారిగా ఎం.సుధారాణి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యాలయ సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు.
AP: రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒక్క జిల్లా సమస్య కాదని వైసీపీ నేత సజ్జల అన్నారు. రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ‘జూరాల, శ్రీశైలం నుంచి తెలంగాణ 8 TMCలు తీసుకుంటోంది. ఏ అనుమతులతో తెలంగాణ ప్రాజెక్టులు కట్టింది. ఇలాంటి చర్యలను ప్రభుత్వం అడ్డుకోకపోవడం దారుణం. రాయలసీమ ఎత్తిపోతలను పూర్తి చేసి మీరే క్రెడిట్ తీసుకున్నా అభ్యంతరం లేదు’ అని పేర్కొన్నారు.
E.G: CM చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో బెయిల్‌పై విడుదలైన అంబటి రాంబాబును ఆదివారం తూ.గో. జిల్లా YCP కాపు నేతలు కలిశారు. తాళ్లపూడి మండలానికి చెందిన YCP రాష్ట్ర కార్యదర్శి తోట రామకృష్ణ, వామిశెట్టి పరమేశ్వరరావు రాజకీయ పరిణామాలపై చర్చించారు. YCPలో మాత్రమే కాపులకు ప్రాధాన్యత ఉందని తోట రామకృష్ణ తెలిపారు. ఈ భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
NDL: కడపలో మేడ కన్వెన్షన్ హాలులో రాయలసీమ లిస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి భవిష్యత్ కార్యాచరణకు ఆదివారం రాయలసీమ జిల్లాల వైసీపీ నేతల సమావేశం నిర్వహించింది. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఇందులో నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు.
జమ్మూకాశ్మీర్‌లో హైటెన్షన్ నెలకొంది. పూంచ్ ప్రాంతంలో డ్రోన్ల చొరబాటు కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు డ్రోన్లను తిప్పికొట్టాయి. డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మాదక ద్రవ్యాలు లేదా పేలుడు పదార్థాలను ఏవైనా జారవిడిచారా అనే అనుమానం వ్యక్తమవుతోంది. దీంతో స్థానిక పోలీసులు, సైన్యం కలిసి ఆ ప్రాంతంలో తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు.
WNP: చిన్నంబావి మండలం కొప్పునూరు గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు 20 మంది కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. వచ్చే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
KMR: భిక్కనూర్ మండలం జంగంపల్లిలో విద్యుత్ షాక్‌తో పెయింటర్ అజీజ్ మృతి చెందారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన అజీజ్ జంగంపల్లిలో ఓ ఇంటికి రంగులు వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ మెయిన్ లైన్ తగిలి ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
NDL: పాములపాడు మండలం భానుముక్కలలో రూ.40 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లు నిర్మాణానికి ఎమ్మెల్యే గిత్త జయసూర్య భూమి పూజ చేసే పనులను ప్రారంభించారు. ఈ రోడ్డు నిర్మాణం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించాలన్నదే ప్రభుత్వం లక్ష్మమన్నారు. త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. టీడీపీ నేత సురేంద్ర నాథ్ రెడ్డి ఇతరులు పాల్గొన్నారు.
ATP: అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో నిర్వహించిన హాకీ టోర్నమెంట్‌లో విద్యార్థి యువన్ క్రిష్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. బ్రహ్మసముద్రం మండలం గొంచిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఈ విద్యార్థి, అండర్-10 హాకీ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. క్రీడల్లో విశేష ప్రతిభ చాటిన యువన్ క్రిష్‌ను పాఠశాల HM నారాయణ, ఉపాధ్యాయ బృందం అభినందించింది.
అన్నమయ్య: జిల్లా విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 2వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నారు. వినియోగదారులు 8977716661కు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చని అధికారులు తెలిపారు. అలాగే, ప్రతి సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం ఉంటుంది. జిల్లా వినియోగదారులు 9440817449కు సంప్రదించవచ్చున్నారు.
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బహ్రెయిన్‌లోని యూఎస్ బేస్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఈ దేశంలో ఏపీ, తెలంగాణకు చెందిన సుమారు 50 వేల మంది నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు బహ్రెయిన్‌లోని ప్రవాస తెలుగువారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఏపీఎన్ ఆర్టీ ద్వారా సహాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.