SRCL: బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో గత కొన్నేళ్లుగా మూతపడి ఉన్న వాటర్ ప్లాంట్ను తిరిగి ప్రారంభించారు. గ్రామంలో నీటి సరఫరాకు సంబంధించిన గేట్ వాల్స్, పైపు లీకేజీలు, హ్యాండ్ బోర్లనుకూడా మరమ్మతులు చేశారు. ఈ చర్యలతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొంగాని అశోక్ గౌడ్, మాజీ ఎంపిటిసి అక్కనపల్లి ఉపేందర్, పాల్గొన్నారు.